»Icc Website Makes India Test No 1 Then Reverses It
Test Rankings: ICC తప్పిదం, 4 గంటలు భారత్ నెంబర్ 1
నిన్నటి గెలుపుతో టెస్టుల్లోను ఆస్ట్రేలియాను దాటిందని ఐసీసీ వెబ్ సైట్ చూపించింది. అయితే ఐసీసీ వెబ్ సైట్ సాంకేతిక సమస్య కారణంగా భారత్ టెస్టుల్లోను అగ్రస్థానానికి చేరుకుంది. నిజానికి ఆస్ట్రేలియాను ముందు నిలిచింది. దీనిని గుర్తించిన ఐసీసీ తన వెబ్ సైట్‌ను కరెక్ట్ చేసింది.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాగపూర్ వేదికగా ఆస్ట్రేలియా (Australia) పైన మొదటి టెస్టులో అద్భుత విజయం సాధించిన భారత జట్టు (Team India) టెస్ట్ ఫార్మాట్లోను నెంబర్ వన్ స్థానానికి ఎగబాకిందని, తద్వారా అన్ని ఫార్మాట్ల క్రికెట్‌లోను (Cricket) భారత జట్టు అగ్రస్థానంలో కొనసాగుతోందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే మన జట్టు వన్డే, టీ20ల్లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. నిన్నటి గెలుపుతో టెస్టుల్లోను ఆస్ట్రేలియాను దాటిందని ఐసీసీ వెబ్ సైట్ చూపించింది. అయితే ఐసీసీ వెబ్ సైట్ సాంకేతిక సమస్య కారణంగా భారత్ టెస్టుల్లోను అగ్రస్థానానికి చేరుకుంది. నిజానికి ఆస్ట్రేలియాను ముందు నిలిచింది. దీనిని గుర్తించిన ఐసీసీ తన వెబ్ సైట్‌ను కరెక్ట్ చేసింది. దాదాపు ఓ నాలుగు గంటల పాటు ఐసీసీ వెబ్ సైట్ ప్రకారం భారత జట్టు టెస్టుల్లోను నెంబర్ వన్‌గా నిలిచి మీడియాకు వార్తలకు, అభిమానులకు కొద్ది గంటలు సంతోషాన్ని మిగిల్చింది. కానీ అంతలోనే నెంబర్ వన్ కాదని తెలియడంతో క్రికెట్ అభిమానులు ఆవేదనకు గురయ్యారు. పొరపాటును గ్రహించిన ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ( International Cricket Council) సరిదిద్దడంతో భారత జట్టు రెండో స్థానంతో సరిపెట్టుకుంది.
అయితే ఈ పొరపాటు ఎందుకు జరిగింది… ఎలా జరిగింది… ఎవరు చేశారనే అంశంపై ఐసీసీ వెల్లడించలేదు. వెబ్ సైట్లో జరిగిన తప్పును సరిదిద్దింది. ఇప్పటి వరకు భారత జట్టు టీ20, వన్డేల్లో నెంబర్ వన్‌గా ఉంది. టెస్టుల్లో నెంబర్ 2 స్థానంలో కొనసాగుతోంది. ర్యాంకింగ్‌లో ఆస్ట్రేలియా 126 పాయింట్లతో అగ్రస్థానంలో టీమిండియా 115 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాయి. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ తదుపరి మ్యాచ్ ఢిల్లీలో జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఇండియా గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకుంటే అప్పుడు టీమిండియా నెంబర్ 1గా నిలుస్తుంది. అప్పుడు భారత్ 121 పాయింట్లకు పెరిగి, ఆస్ట్రేలియాకు 120 పాయింట్లకు తగ్గుతుంది. ర్యాంకింగ్ లేదా పాయింట్స్ విషయంలో అప్పుడే మనం ఆసీస్‌ను దాటలేదు. కానీ తొలి టెస్టులో ఓడిన ఆస్ట్రేలియా ఏకంగా 15 పాయింట్లు కోల్పోయి రెండో స్థానంలోకి దిగజారిందని నిన్న మధ్యాహ్నం రెండున్నర గంటలకు ఐసీసీ వెబ్ సైట్లో కనిపించింది. ఆసిస్ 126 పాయింట్లతో ఉండగా, ఓటమి తర్వాత 111 పాయింట్లకు పడిపోయినట్లు చూపించింది. కానీ తప్పిదాన్ని తెలుసుకొని రాత్రి ఏడు గంటల సమయంలో సరిదిద్దింది.
ఈ ఏడాది జనవరి 18వ తేదీన కూడా ర్యాంకింగ్స్‌లో ఇదే తప్పు చోటు చేసుకుంది. తన అధికారిక వెబ్సైట్లో మధ్యాహ్నం 1:30 గంటలకు టీమిండియాను నెంబర్ 1 టెస్ట్ జట్టుగా సూచించింది. రెండున్నర గంటల తర్వాత భారత్‌ను నెంబర్ 1 నుండి నెంబర్ 2కి మార్చింది. ఆస్ట్రేలియా మళ్లీ నెంబర్ 1 టెస్టు జట్టుగా అవతరించింది. కాగా, టెస్టుల్లో ఆసిస్, భారత్ వరుసగా రెండు స్థానాల్లో ఉండగా, ఇంగ్లాండ్ 106 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఫిబ్రవరి 16వ తేదీ నుండి న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ ఆడుతున్న ఇంగ్లాండ్ తన స్థానాన్ని మరింత మెరుగుపరుచుకునే అవకాశాలు ఉన్నాయి.
ఇదిలా ఉండగా, టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్‌లో స్పిన్నర్ అశ్విన్ రెండో ర్యాంకులో, మోకాలి శస్త్ర చికిత్స నుండి కోలుకొని పునరాగమనంలో సత్తాచాటిన జడెజా బౌలర్ల ర్యాంకింగ్స్‌లో 16వ స్థానంలో ఉన్నాడు. ఆసిస్ కెప్టెన్ కమిన్స్ అగ్రస్థానం సాధించాడు. ఇటీవలి టెస్టులో శతకం చేసిన రోహిత్ శర్మ బ్యాటింగ్ విభాగంలో రెండు స్థానాలు మెరుగు పరుచుకొని, ఎనిమిదో స్థానంలోకి వచ్చాడు. రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆటకు దూరమైన పంత్ ఏడో స్థానంలో కొనసాగుతున్నాడు. అక్షర్ పటేల్ ఏకంగా ఆరు స్థానాలు ఎగబాకి ఏడో స్థానంలోకి వచ్చాడు.