Chandhra Babu Naidu : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు కి తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని మరో వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో చంద్రబాబు ప్రయాణిస్తున్న కారు బంపర్ ద్వంసమయ్యింది.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు కి తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని మరో వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో చంద్రబాబు ప్రయాణిస్తున్న కారు బంపర్ ద్వంసమయ్యింది. అయితే…. చిన్న ప్రమాదం కావడంతో… కారులో ఉన్నవారికి ఎవరికీ ఏమీ కాలేదు. అందరూ క్షేమంగా బయటపడ్డారు. చిన్న ప్రమాదం కావడంతో అక్కడున్నవారంతా ఊపిరి పీల్చుకున్నారు. చంద్రబాబు… తూర్పుగోదావరి జిల్లా లో పర్యటిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ‘ఇదేం కర్మ మన రాష్ట్రానికి’ పేరుతో మూడు రోజుల పాటు మూడు నియోజకవర్గాల్లో రోడ్ షోలు, బహిరంగ సభలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.