»4th Class Boy Complaint To Police On His Mother In Eluru
Eluru : నచ్చిన చొక్కా ఇవ్వాలేదని టవల్ పైనే స్టేషన్ కెళ్లి తల్లిపై ఫిర్యాదు చేసిన కొడుకు
ఏలూరు పట్టణంలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. నాలుగో తరగతి చదువుతున్న బాలుడు పోలీస్ స్టేషన్ కెళ్లి తన తల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. కారణం తెలిసి పోలీసులు షాక్ అయ్యారు.
Eluru : ఏలూరు పట్టణంలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. నాలుగో తరగతి(4th class) చదువుతున్న బాలుడు పోలీస్ స్టేషన్(police station) కెళ్లి తన తల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. కారణం తెలిసి పోలీసులు షాక్ అయ్యారు. పట్టణంలోని కొత్తపేట(kottapet)లో పదేళ్ల సాయి దినేష్ తల్లిదండ్రులతో కలిసి నివాసముంటున్నాడు. నాలుగో తరగతి వార్షిక పరీక్షలు(exams) రాశాడు. వచ్చే ఏడాది ఐదో తరగతిలోకి వెళతాడు. ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో దినేష్ తో పాటు అక్క కూడా ఇంటివద్దే ఉంటున్నారు. రెండేళ్లక్రితం దినేష్ తల్లి అనారోగ్యంతో మృతిచెందండంతో తన తండ్రి మరో పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం దినేష్ తో పాటు సోదరి ఆలనాపాలనా సవతి తల్లి చూసుకుంటోంది. ఇలా నిన్న(ఆదివారం) కూడా దినేష్ తల్లివద్దే ఉన్నాడు.
రోజంతా ఇంట్లోనే ఉన్న దినేష్ సాయంత్రం తన ఫ్రెండ్ బర్త్ డే పార్టీ(birthday party) ఉండడంతో బయటకు వెళ్లడానికి సిద్దమయ్యాడు. స్నానం చేసి టవల్ కట్టుకుని బాత్రూం నుంచి బయటకు వచ్చిన బాలుడు తెల్ల చొక్కా ఇవ్వాలని తల్లిని అడిగాడు. బయటకు వెళ్లొద్దని తల్లి హితవు పలికింది. వెళ్లకుండా ఉండాలని తల్లి చొక్కా ఇవ్వడానికి నిరాకరించింది. ఆమె మాటలు వినకుండా మారాం చేస్తున్న దినేష్ ను కొట్టింది. దీంతో బాలుడు ఏడుస్తూ అలాగే టవల్ కట్టుకుని అర్ధనగ్నంగా నడుచుకుంటూ నేరుగా స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి తల్లిపై ఫిర్యాదు చేసాడు. అయితే దినేష్ నుండి తల్లిదండ్రుల వివరాలు సేకరించిన పోలీసులు వారిని పోలీస్ స్టేషన్ కు పిలిపించారు. వారికి కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు తల్లిదండ్రుల మాట విని బుద్దిగా చదువుకోవాలని బాలుడికి నచ్చజెప్పారు. అనంతరం దినేష్ ను తల్లిదండ్రులకు అప్పగించారు. గతంలోనూ దినేష్ ను చిత్రహింసలు పెడుతోందంటూ మారుతల్లిపై పోలీసులకు ఫిర్యాదులు అందాయి.