మంత్రి అయితే ఎవరికి గొప్ప. మా తమ్ముడు కారు నడిపి జీవనం సాగిస్తున్నాడు. వాడు కారు తిప్పితే మా అమ్మ పింఛన్ ఎలా తొలగిస్తారు’ అని వెంకటేశ్వర్లు మంత్రి అంబటిని నిలదీశాడు. ఈ క్రమంలో మంత్రికి, ఆ యువకుడికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అక్కడే ఉన్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి వెంకటేశ్వర్లును అదుపులోకి తీసుకున్నారు. మంత్రి నిలదీస్తావా అంటూ పోలీసులు అతడిని లాక్కెళ్లి వాహనంలో కూర్చోబెట్టారు.
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ ఓ స్కూల్ గర్ల్ బ్యాటింగ్‌కు ఫిదా అయ్యారు. నిన్ననే డబ్ల్యూపీఎల్ వేలం ముగిసింది... ఈ రోజు మ్యాచ్ ప్రారంభం అయింది... ఎంత విశేషం... నీ బ్యాటింగ్ చూసి చాలా ఎంజాయ్ చేశాను అంటూ లిటిల్ మాస్టర్ ఆమె బ్యాటింగ్ చేస్తున్న వీడియోను షేర్ చేశారు. ఆమె సూర్యకుమార్ ఆట తీరును చూసి, అతనిలా లాంగ్ షాట్స్ కొట్టే మెళకువలు కూడా తెలుసుకోవాలని సూచించారు.
ప్రయాణికులు అంతా సురక్షితంగా ఉన్నారని రైల్వే శాఖ అధికారులు ప్రకటించారు. ఈ సంఘటనతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కాజిపేట- సికింద్రాబాద్ మార్గంలో పలు రైళ్ల రాకపోకలు ఆలస్యంగా కొనసాగుతున్నాయి. భువనగిరి, బీబీనగర్, ఘటకేసర్ స్టేషన్లలో పలు రైళ్లను నిలిపివేశారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో రైళ్లను రాకపోకలు సాగిస్తున్నారు. ప్రస్తుతం రైల్వే సిబ్బంది ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపట్టారు.
దేశీయ ప్రయివేటురంగ దిగ్గజం కొటక్ మహీంద్రా బ్యాంకు (Kotak Mahindra Bank) ప్రముఖ కమెడియన్ తన్మయ్ భట్‌తో (Tanmay Bhat) వ్యాపార ప్రకటనల కోసం ఒప్పందం కుదుర్చుకున్నది. అయితే ఆయన నోటి దురుసు కారణంగా బ్యాంకు ఆయనను తప్పించే వరకు వచ్చింది.
ఆర్కే రోజాను ప్రస్తావిస్తూ ‘ఇది వరకే తెలంగాణ సాంస్కృతిక, పర్యాటక మంత్రి రోజా చెప్పారు’ అంటూ ప్రసంగిస్తుండగా అక్కడే ఉన్న అధికారులు, మీడియా ప్రతినిధులు ‘ఆంధ్రప్రదేశ్’ అని రెండు మూడుసార్లు చెప్పారు. ఈ పరిణామానికి వెంటనే తేరుకున్న కిషన్ రెడ్డి, రోజా ఇద్దరు గొల్లున నవ్వారు. ఆ సమావేశంలో పాల్గొన్న వారందరూ నవ్వుకున్నారు. అయితే ఈ విషయమై రోజాకు వివరణ ఇస్తుండగా.. ‘పర్లేదు. కానీయండి’ అంటూ రోజా అన్నారు. అనం...
ఆర్థికమంత్రి మాట్లాడుతూ... మూడు రాజధానులు ఏమీ లేవని, విశాఖనే తాము రాజధానిగా చేయబోతున్నామని స్పష్టం చేశారు. కర్నూలులో న్యాయ రాజధాని కాదని, అక్కడ కేవలం హైకోర్టు ప్రిన్సిపల్ బెంచ్ మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌కు పరిశ్రమలు తీసుకు రావాల్సిన మంత్రి, ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి వనిత (Vangalapudi Anitha) ధ్వజమెత్తారు.
KTR : హైదరాబాద్ నగర వాసుల ట్రాఫిక్ కష్టాలను మెట్రో చాలా వరకు తీర్చిందనే చెప్పాలి. మెట్రో అడుగుపెట్టిన తర్వాత ప్రయాణం కాస్త సులువుగా మారింది. కాగా... ఈ మెట్రో సదుపాయాలను మరింత పెంచుతున్నట్లు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. నగరంలో ప్రస్తుతం మెట్రో రైలు సేవలు అందుబాటులోని లేని ప్రాంతాలను కూడా కవర్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. తాజాగా రామోజీ ఫిల్మ్ సిటీ వరకు కూడా మెట్రోను విస్తరించాలని ప్...
Love Birds : ప్రతి ఒక్కరూ తమ పెళ్లిని అంగరంగ వైభవంగా జరుపుకోవాలని అనుకుంటారు. జీవితంలో పెళ్లి ఒకసారి మాత్రమే వస్తుంది కాబట్టి.. కనీవినీ ఎరుగని రీతిలో జరుపుకోవాలని అనుకుంటూ ఉంటారు. అయితే.. ఒక జంట మాత్రం ఆస్పత్రిలో పెళ్లి చేసుకుంది. నమ్మసక్యంగా లేకపోయినా ఇది నిజం. పెళ్లికి ముందు వధువు ప్రమాదానికి గురి కావడంతో... ఆస్పత్రిలోనే వీరు పెళ్లి చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. ఈ సంఘటన రాజస్థాన్...
KA Paul :కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పై కేఏ పాల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎవరో తనకు తెలియదని ఆయన కామెంట్ చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీకి హుజురాబాద్ ఉప ఎన్నికలో మూడు లక్షల ఓట్లు ఉంటే మూడు వేల ఓట్లు పడ్డాయని, ఇక భవిష్యత్‌లో కాంగ్రెస్ పార్టీ గెలవదనే విషయం అందరికీ తెలుసు అని ఎద్దేవా చేశారు.
నల్గొండ పార్లమెంటు సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో హంగ్ ప్రభుత్వం ఏర్పడుతుందని బాంబు పేల్చారు. వచ్చే ఎన్నికల అనంతరం బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్‌తో కలిసి వెళ్లదని, అలాంటి సమయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పొత్తు ఉండవచ్చునని అభిప్రాయపడ్డారు.
ముఖ్యమంత్రి జగన్, హోంమంత్రి వనిత తమ పదవులకు రాజీనామా చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలి పోతుందని తెలుగు మహిళా ఆధ్యక్షురాలు వంగలపూడి అనిత మంగళవారం మండిపడ్డారు. తాడేపల్లి పరిధిలో ఓ అంధురాలిపై గంజాయి బ్యాచ్ కత్తితో దాడి చేసి, హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు బాధ్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కరోనా వైరస్‌తో ప్రపంచం మొత్తం అల్లాడిపోయింది. ఇప్పుడిప్పుడే ఆ వైరస్ నుంచి మెల్లమెల్లగా కోలుకుంటున్న ప్రపంచం మరో వైరస్ తో ఉలిక్కి పడింది. ఈక్వటోరియల్ గినియాలో మార్ బర్గ్ వైరస్ (Marburg Virus) కలకలం రేపింది. ఈ వైరస్ వల్ల ఇప్పటి వరకూ 9 మంది మరణించారు. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మంగళవారం వెల్లడించింది.
Amith Shah : కాంగ్రెస్ కి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సవాలు విసిరారు. అదానీ అంశంపై తామేదీ దాచిపెట్టే ప్రసక్తి లేదని, దీనిపై భయపడబోమని ఆయన పేర్కొన్నారు. కావాలంటే కాంగ్రెస్ కోర్టుకు కూడా వెళ్లవచ్చని ఆయన అన్నారు. పెగాసస్ అంశంపైనా మీరు ఇలాగే ఫేక్ ఆరోపణలు చేశారని మండిపడ్డారు.
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటు చేసుకున్నది. మిచికాన్ స్టేట్ యూనివర్సిటీ (Michigan State University) ప్రధాన క్యాంపస్‌లోకి ప్రవేశించిన ఓ అగంతకుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. దీంతో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఐదుగురు గాయపడినట్లుగా తెలుస్తోంది.