బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగాన్ని ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు బీఆర్ఎస్ కూడా బహిష్కరించింది. నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రాష్ట్రపతి ప్రసంగం బహిష్కరించినట్లు ఆ పార్టీలు తెలిపాయి. అంతే కానీ రాష్ట్రపతికి వ్యతిరేకంగా తాము లేని బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ పక్ష నేత కె.కేశవ రావు స్పష్టతనిచ్చారు. ఈ ...
గ్యాస్ సిలిండర్ డెలివరీ పేరుతో అనేక దోపిడీలు జరుగుతున్నాయి. ఈ దోపిడీలను అరికట్టేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్యాస్ డీలర్లు వినియోగదారుల్ని డెలివరీ ఛార్జీల పేరుతో దోచుకుంటున్నా సర్కార్ పట్టించుకోవడం లేదనే ఆరోపణ ఉంది. ఈనేపథ్యంలో ఏపీ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ సోమవారం ఓ ప్రకటన చేశారు. తాజా నిబంధనల ప్రకారంగా గ్యాస్ ఏజెన్సీ నుంచి ఐదు కిలో మీటర్ల దూరంలోపు గ్యాస్ సిలిండర్ డెలివరీ చేస్తే...
రాజధాని విషయమై ఢిల్లీలో జరుగుతున్న ఏపీ గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ లో సీఎం జగన్ మోహన్ రెడ్డి సంచలన ప్రకటన చేశాడు. విశాఖపట్టణం రాజధాని కాబోతుందని.. కొన్ని నెలల్లో తాను కూడా అక్కడే మకాం మార్చనున్నట్లు ప్రకటించాడు. సుప్రీంకోర్టులో రాజధాని మార్పుపై విచారణ జరుగుతున్న సమయంలోనే జగన్ ప్రకటన చేయడం విశేషం. ఈ ప్రకటనతో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ లో అలజడి రేగింది. అమరావతి రాజధానిగా కొనసాగాలని ఉద్యమం కొనసాగ...
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా తెరకెక్కి అనేక అవార్డులను గెలుచుకుంటోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు కలిసి నటించిన ఈ సినిమా భారీ హిట్ అందుకుంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే నాటు నాటు పాటకు గాను గోల్డెన్ గ్లోబ్ అవార్డు లభించింది. అంతేకాకుండా పలు అంతర్జాతీయ స్థాయి అవార్డులు కూడా దక్కాయి. ఆస్కార్ అవార్డుకు కూడా నాటు నాటు పాట నామినేట్ అయ్యి రికార్డు నెలకొల...
తనను తెలంగాణ నుంచి తరిమేస్తారా.. తరిమేయండి బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ అని తెలిపారు. తాను మాత్రం ధర్మ మార్గం విడవని ప్రకటించారు. విద్వేష ప్రసంగాలతో మరోసారి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారంటూ తెలంగాణ పోలీసులు జారీ చేసిన నోటీసులపై మంగళవారం స్పందించారు. తాను రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని.. తన జీవితం ధర్మం కోసమేనని ప్రకటించారు. ఎక్కడో ముంబైలో మాట్లాడితే ఇక్కడ పోలీసులు నోటీసులు ఇవ్వడమేమిటని ప్రశ్న...
హీరో నందమూరి తారకరత్న గుండెపోటుతో బెంగళూరులోని ఆస్పత్రిలో అడ్మిట్ అయిన సంగతి తెలిసిందే. ఏపీ టీడీపీ నాయకుడు నారా లోకేష్ ప్రారంభించిన యువగళం పాదయాత్రలో తారకరత్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా తారకరత్న పాదయాత్రలో స్పృహ తప్పి పడిపోయాడు. కార్యకర్తలు ఆయన్ని కుప్పం హాస్పిటల్ కు తరలించగా హార్ట్ ఎటాక్ అని తెలిపారు. ఫస్ట్ ఎయిడ్ ట్రీట్ మెంట్ అందించాక మెరుగైన చికిత్స నిమిత్తం బెంగళూరులోని నారాయణ హృదయాలయా ఆస్పత్...
దేశ ప్రగతిలో యువశక్తి, నారీశక్తి భాగస్వామ్యం కావాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. పేదరికం లేని భారత్ నిర్మాణం జరగాలని ఆకాంక్షించారు. రాబోయే పాతికేళ్లు దేశానికి ఎంతో కీలకమని అభిప్రాయ పడ్డారు. ఆత్మ నిర్భర్ భారత్ ను నిర్మించుకుందామని తెలిపారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రపతి ప్రసంగం ఇలా కొనసాగింది.. ‘అ...
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ముందు ప్రధాని నరేంద్ర మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మోడీ మాట్లాడుతూ ప్రపంచం మొత్తం భారతదేశం బడ్జెట్ వైపు చూస్తోందన్నారు. పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసే ప్రసంగం మన రాజ్యాంగానికి, ప్రత్యేకించి మహిళల గౌరవానికి గర్వకారణమన్నారు. ఐఎంఎఫ్ ఆర్థిక అంచనాల గురించి కూడా ప్రధాని మోడీ మాట్లాడారు. ప్రజా సమస్యలను తగ్గించి సరైన పాలన అందించే దిశగా బడ్జెట్ ...
విమాన ప్రయాణంలో ప్రయాణికులు రచ్చరచ్చ చేస్తున్నారు. ముష్టిఘాతాలు, బాహాబాహీకి దిగి బీభత్సం సృష్టిస్తున్నారు. దేశీయంగానే కాక అంతర్జాతీయ విమానాల్లోనూ ఇలాంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మరో విమానంలో ఓ మహిళ నానా రభస చేసింది. సిబ్బందిపై దాడి చేయడమే కాక విమానంలో అర్ధ నగ్నంగా తిరుగుతూ వికృత చేష్టలకు పాల్పడింది. తోటి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆమెను అదుపులోకి తీసుకుని పోలీసులకు...
తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ తగ్గింది. మంగళవారం కావడంతో భక్తుల సంఖ్య కాస్త తగ్గిందని టీటీడీ అధికారులు తెలిపారు. రద్దీ తగ్గడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో రెండు కంపార్టుమెంట్లలోనే భక్తులు వేచి వున్నారు. స్వామివారి దర్శనం కోసం సర్వదర్శనం టోకెన్లు లేని భక్తులకు 8 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. అలాగే రూ.300ల టికెట్ గల భక్తులకు రెండు నుంచి మూడు గంటల సమయం పడుతోందని అధికారు...
ఏపీలో అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలే కాదు ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పార్టీ అధినాయకత్వం, ఏపీ ప్రభుత్వం తీరుపై సొంత పార్టీ నాయకులే తీవ్ర ఆగ్రహంలో ఉన్నారు. ఈ ఆగ్రహం నివురుగప్పిన నిప్పులా అలుముకుంది. పార్టీ కార్యక్రమాల్లో అప్పుడప్పుడు ఇది బహిర్గతమవుతోంది. అందుకే తరచూ మంత్రులు, ఎమ్మెల్యేలు సొంత ప్రభుత్వంపైనే విమర్శలు చేస్తున్నారు. తాజాగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్య...
యువగళం పాదయాత్రలో గుండెపోటుకు గురైన నందమూరి తారకరత్న బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం మెరుగైందని.. చికిత్సకు తారకరత్న స్పందిస్తున్నాడు అనే వార్తతో తెలుగు ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. తారకరత్న ఆరోగ్యంపై క్షణ క్షణం ఉత్కంఠ రేపిన విషయం తెలిసిందే. నందమూరి కుటుంబసభ్యులు కూడా తారకరత్న ఆరోగ్యంతో ఉన్నాడని, ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదని ప్రకటించారు....
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ప్రతి చిన్న పనికి ఇబ్బంది పడాల్సి వస్తోందని తన శాఖపరమైన విషయంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రిగా ఉన్నా కూడా స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకున్నట్లు ఆర్డర్ చేసుకోవాల్సి వస్తోందని వాపోయారు. చివరకు పెన్ను కొనాలన్నా ఆర్డర్ ఇచ్చుకోవాల్సి వస్తోందని తెలిపారు. తమిళనాడులోని చెన్నైలో సోమవారం జరిగిన ఓ కార్య...
తెలంగాణలో మళ్లీ ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ అధికారులు దాడులు జరిపారు. హైదరాబాద్ లో మంగళవారం తెల్లవారుజామునే ఐటీ సోదాలు మొదలవడం కలకలం రేపింది. వసుధ ఫార్మా కెమ్ లిమిటెడ్ తో పాటు పలు చోట్ల ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ వ్యాప్తంగా మొత్తం 40 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. వసుధ ఫార్మా చైర్మన్ రాజుతో పాటు సంస్థ డైరెక్టర్ల నివాసాల్లోనూ సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ తో పాటు మరికొన్ని ప్రాంతాల...
షార్ట్ సర్క్యూట్ కారణంగా అమర్‌రాజా ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో స్థానికులు, జాతీయ రహదారిపై కలకలం రేపింది. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం ఏర్పడగా.. కార్మికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా మోర్దానపల్లెలో జాతీయ రహదారి పక్కన అమర్‌రాజా ఫ్యాక్టరీ ఉంది. 150 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ పరిశ్రమలో బ్యాటరీలు తయారు చేస్తుంటారు. సోమవ...