»Wedding Bus Fell Into The Valley Pakistan Punjab Province 15 People Died On The Spot 60 People Were Injured
Accident: లోయలో పడ్డ పెళ్లి బస్సు..15 మంది స్పాట్ డెడ్, 60 మందికి గాయాలు
పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ఓ బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందగా, మరో 60 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో చోటుచేసుకుంది.
తూర్పు పాకిస్తాన్(pakistan)లోని పంజాబ్ ప్రావిన్స్(punjab province)లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పెళ్లి బృందంతో వెళుతున్న ప్రయాణికుల బస్సు(bus) అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 15 మంది ప్రయాణికులు మృతి చెందగా, మరో 60 మంది గాయపడ్డారు. కల్లార్ కహర్ పట్టణానికి సమీపంలో రాత్రిపూట ఈ ప్రమాదం జరిగిందని అక్కడి డిప్యూటీ కమిషనర్ ఖురతులైన్ మాలిక్ తెలిపారు. మృతులు, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు(police) కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఆదివారం ఓ పెళ్లి వేడుకకు వెళ్లి తిరిగి ఇస్లామాబాద్(islamabad) నుంచి లాహోర్(lahore)కు రాత్రి వెళ్తున్న క్రమంలో ఈ బస్సు ప్రమాదానికి గురైందని అధికారులు చెబుతున్నారు. బస్సు అతివేగంతోపాటు ఎదురుగా వచ్చిన వాహనాలను ఢీకొట్టడంతో ఈ ప్రమదం చోటుచేసుకుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ దుర్ఘటన పట్ల జరిగిన ప్రాణనష్టంపై పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్(pakistan pm shahbaz sharif) సంతాపం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి సాధ్యమైనంత ఉత్తమమైన వైద్య చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.
మరోవైపు గత నెలలో కూడా లాస్బెలాలోని దక్షిణ జిల్లాలో ఒక ప్రయాణీకుల(passengers) బస్సు పిల్లర్‌ను ఢీకొని వంతెనపై నుంచి పడిపోవడంతో మంటలు చెలరేగి 40 మంది మరణించారు. అయితే పాకిస్తాన్లో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడం వల్లే ఇలా ప్రమాదాలు జరుగుతున్నాయని పలువురు అంటున్నారు. ఇలా ప్రతి ఏటా వేలాది మంది మరణిస్తున్నారని చెబుతున్నారు.