»15 People Died In Maharashtra Eknath Shinde Cm Thane District After Crane Fell
Crane fell: సీఎం జిల్లాలో క్రేన్ పడి 17 మంది మృతి
ముంబై-నాగ్పూర్ ఎక్స్ప్రెస్వే (సమృద్ధి మహామార్గ్) పనులు జరుగుతున్న షాపూర్లో గిర్డర్పై క్రేన్ ప్రమాదవశాత్తు కూలింది. ఈ ఘటనలో 17 మంది కార్మికులు మృత్యువాత చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ ఘటన మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే సొంత జిల్లా థానే(thane district)లో చోటుచేసుకుంది.
మహారాష్ట్ర(maharashtra) ముఖ్యమంత్రి సొంత జిల్లా థానే(thane district)లో గిర్డర్పై క్రేన్ కూలిపోవడంతో దాదాపు 17 మంది కార్మికులు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. ప్రాంతీయ విపత్తు నిర్వహణ యూనిట్ ప్రకారం మంగళవారం తెల్లవారుజామున 1 గంటలకు ఈ ఘటన జరిగింది. ముంబై-నాగ్పూర్ ఎక్స్ప్రెస్వే (సమృద్ధి మహామార్గ్) పనులు జరుగుతున్న షాపూర్లో భారీ గామ్ట్రిక్రేన్ గిర్డర్పై కూలిపోవడంతో కార్మికులు(workers) చిక్కుకున్నారని అధికారులు తెలిపారు. నాసిక్-ముంబై మధ్య 701 కి.మీ-పొడవైన సమృద్ధి మహామార్గ్ మూడవ, చివరి దశ పనులు కొనసాగుతున్న సర్గావ్, సారాంబేగైన్ మధ్య ఈ ప్రదేశం ఉంది. సమాచారం తెలుసుకున్న NDRF, SDRF సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. అయితే మృతుల సంఖ్య మరింత పెరుగుతుందనే భయంతో థానే పోలీసులు అగ్నిమాపక దళం, విపత్తు ఏజెన్సీ బందాలు పనులు వేగవంతం చేస్తున్నాయి. మరోవైపు విషయం తెలుసుకున్న సీఎం షిండే మృతుల గురించి ఆరా తీశారు.