కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరి వద్దనైనా తాను ఒక రూపాయి కమీషన్ తీసుకున్నట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని గడ్కరీ సంచలన కామెంట్స్ చేశారు. ముంబై(Mumbai)లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన రాజకీయాలంటే డబ్బులు సంపాదించే వ్యాపారం కాదని తనకు ఎవరి వద్ద నుంచి కమీషన్ తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. నా యూట్యూబ్ ఛానెల్ (YouTube channel) ద్వారా నెలకు రూ.3 లక్షల ఆదాయం లభిస్తుందని తెలిపారు.
తాను హిందీ, మరాఠీ ఇంగ్లీష్‌లో చేసిన ప్రసంగాలకు చాలా మంది వీక్షిస్తారని అమెరికా(America)లో ఉన్న వారు సైతం తన ప్రసంగాల చూస్తారని తెలిపారు. కులం, మతం, భాష ఆధారంగా వ్యక్తుల స్థాయిని నిర్ణయించలేమని వ్యక్తిత్వం, లక్షణాలే వ్యక్తుల గొప్పతనాన్ని నిర్ణయిస్తాయన్నారు. తనకు అన్ని కులాల మద్దతు కావాలన్నారు. తాను రాజకీయ నాయకుడి(Politician)నని, తనకు అన్ని వర్గాల వారి ఓట్లు అవసరమే అన్నారు. అందుకే తాను కులం గురించి మాట్లాడనని చెప్పారు. అన్ని కులాల వారు తనకు కుటుంబ సభ్యులేనని, తనకు సోదర సమానులే అన్నారు.