Viral Video: ఓ మహానుభావా..? నీ తిండి నీదేనా, భార్యను పట్టించుకోవా..?
భర్తకు ఆకలిగా ఉందని.. భార్య తాను తినాల్సిన ఫుడ్ పెడుతోంది. ఇంత జరుగుతున్నా సదరు భర్త మొబైల్లో బిజీగా ఉన్నాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా తెగ వైరల్ అవుతుంది.
Viral Video: ఈ రోజుల్లో భార్య భర్తలు కలిసి మాట్లాడుకోవడం..? గొడవలు పరిష్కరించుకోవడం అరుదు అవుతున్నాయి. చిన్న విషయాలను పెద్దగా చేసుకుంటున్నారు. కొందరే కలిసి మెలసి ఉంటున్నారు. కింద ఉన్న వీడియోలో ఓ భర్త (hudband) ఫోన్ ముందు బిజీగా ఉన్నాడు. పక్కన ఉన్న భార్యను పట్టించుకోలేదు. ఇద్దరు కలిసి భోజనం చేస్తున్నప్పటికీ ఆమెను కేర్ చేయడం లేదు.
ఫోన్ (mobile) చూస్తూనే.. స్పూన్ పట్టుకొని తినేస్తున్నాడు. ఇంతలో తన ప్లేట్లో అన్నం అయిపోతుంది. ఆమెకు సైగలతోనే అన్నం పెట్టాలని కోరతాడు. ఆమె గిన్నె తీసి చూస్తే అందులో అన్నం అయిపోతుంది. భర్తకు ఆకలిగా ఉందని.. గిన్నెను తన ప్లేట్ వద్దకు తీసుకొని.. అందులో కొంచెం అన్నం వేస్తుంది. ఆ ఆహారం భర్త ప్లేట్లో వేసి సంబర పడిపోతుంది. ఇవన్నీ ఏమీ పట్టించుకోకుండా అతను మళ్లీ ఫోన్ చూస్తూ.. అన్నం తింటాడు.
వీడియో సోషల్ మీడియాలో (social media) షేర్ చేయడంతో వైరల్ అవుతుంది. నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. అసలు భార్యల గురించి పట్టించుకోరా..? ఎందుకిలా అంటూ రెచ్చిపోయారు. ఇంటి కోసం, పిల్లల కోసం.. భర్త, అత్త మామల కోసం భార్య ఎన్ని చేసినా కనీసం గుర్తించడం లేదని అంటున్నారు. ఆ వీడియోలో భార్య తన కడుపుమాడ్చుకొని మరీ భర్తకు పెడుతోంది. దీని కన్నా త్యాగం ఏమి ఉంటుందని అంటున్నారు.