CTR: నేటి నుంచి 30వ తేది వరకు సూళ్లూరుపేట నియోజకవర్గ పరిధిలోని మండలాలకు నూతనంగా మండల టీడీపీ అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ తెలిపారు. అందులో భాగంగా నాయుడుపేట పట్టణంలోని శ్రీనివాస కళ్యాణ మండపంలో ఉదయం 10 గంటలకు ఓజిలి మండల అధ్యక్ష ఎన్నిక, మధ్యాహ్నం 3 గంటలకు పెళ్లకూరు మండల అధ్యక్ష ఎన్నిక జరుగుతుందని అన్నారు.