PDPL: గ్రామపంచాయతీలలో పనిచేస్తున్న సిబ్బందిని శుక్రవారం పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. సమస్యల పరిష్కారం కోసం చలో హైదరాబాద్ కమిషనరేట్ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో జూలపల్లి మండలంలో పంచాయతీ కార్మికులను అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అక్రమ అరెస్టులను పంచాయతీ కార్మికులు ఖండించారు.