SRPT: మునగాల మండలంలోని పలు విత్తనాల, ఎరువుల, పురుగు మందుల దుకాణాలను సూర్యాపేట జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మండలంలో సహకార సంఘాలలో, ప్రైవేటు దుకాణాలలో సమృద్ధిగా విత్తనాలు, ఎరువులు ఉన్నాయన్నారు. లైసెన్స్ కలిగిన దుకాణాల నుంచి మాత్రమే రైతులు కొనుగోలు చేయాలని సూచించారు.