»Bandi Sanjay Sawal To Cm Kcr On Electric Motors With Meter Issue In Telangana
Bandi Sanjay: కేసీఆర్ కేంద్రానికి రాసిన లేఖపై చర్చకు సిద్ధమా..బీఆర్ఎస్ ఇంకా మూడు నెలలే!
తెలంగాణలో మోటార్లకు మీటర్లు పెడతాం లోన్ కావాలని తెలంగాణ ప్రభుత్వమే కేంద్రానికి లేఖ రాసిందన్నారు. ఈ అంశంపై చర్చకు సిద్ధమా అంటూ కేసీఆర్ ను బండి సంజయ్ ప్రశ్నించారు. ఇప్పుడేమో కేంద్ర ప్రభుత్వం మీటర్లు పెడతానని తప్పుడు ప్రచారం చేస్తున్నారని నిలదీశారు. మరోవైపు సింగరేణిలో రాష్ట్రానికి 51 శాతం వాటా ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వం ఎలా ప్రైవేటు పరం చేస్తుందని నిలదీశారు.
కేంద్ర ప్రభుత్వం మోటార్లకు మీటర్లు పెడుతుందని సీఎం కేసీఆర్(cm kcr) సహా బీఆర్ఎస్(brs) నాయకులు తెలంగాణలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ(bjp) రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(bandi sanjay) పేర్కొన్నారు. మరోవైపు తెలంగాణలో మోటార్లకు మీటర్లు పెడతాం లోన్ కావాలని తెలంగాణ ప్రభుత్వామే(Telangana government) కేంద్రానికి లేఖ రాసిందని బండి సంజయ్(bandi sanjay) స్పష్టం చేశారు. ఈ అంశంపై సీఎం కేసీఆర్ చర్చకు రావాలని బండి సంజయ్ సవాల్ చేశారు. ఇలా అనేక సార్లు రాష్ట్రంలో ఉప ఎన్నికలు(by elections) వచ్చినపుడు బీజేపీ (bjp)ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేసి బీఆర్ఎస్ నాయకులు(brs leaders) ప్రజలను తప్పుదోవ పట్టించారని సంజయ్ పేర్కొన్నారు.
ఫిబ్రవరి 5న పంగిడిపల్లిలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్(eatala rajender) పర్యటనలో భాగంగా బీజేపీ కార్యకర్తలపైకి పలువురు రాళ్లదాడి చేశారు. ఆ క్రమంలో దాడి చేసిన వారిని పట్టించుకోకుండా పోలీసులు బీజేపీ నేతలపై ఎఫ్ఐఆర్ కేసులు నమోదు చేయడమెంటని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో పోలీసులే(police) బీఆర్ఎస్ కార్యకర్తల్లా మారిపోయారని బండి సంజయ్ పేర్కొన్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసుల(task force police)కు కార్యకర్తలను కొట్టే అధికారం ఎక్కడిదని ప్రశ్నించారు. ఎమ్మెల్యే పర్యటించినపుడు భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసులకు లేదా అంటూ సంజయ్ ప్రశ్నించారు. అదే బీఆర్ఎస్ నాయకులు వస్తే ఇతర నేతలను ముందుగానే అదుపులోకి తీసుకుంటారని గుర్తు చేశారు. హనుమకొండ జిల్లా కమలాపూర్‌లో సోమవారం సంజయ్ పర్యటించిన క్రమంలో ఈ విధంగా వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో పరకాల సబ్ జైలు నుంచి విడుదలైన బీజేపీ నేతలను పరామర్శించారు.
అన్ని రోజులు ఒకేలా ఉండవని బండి సంజయ్ గుర్తు చేశారు. బీఆర్ఎస్(brs) ప్రభుత్వం ఇంకా ఉండేది మూడు నుంచి నాలుగు నెలలు మాత్రమేనని పేర్కొన్నారు. ఆ తర్వాత రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని వెల్లడించారు. బీజేపీ కార్యకర్తలను కొట్టిన పోలీసులను వదిలేది లేదని స్పష్టం చేశారు. అందరి లిస్ట్ తీస్తున్నామని వెల్లడించారు. కేసీఆర్ రాజీనామా చేస్తానని చెప్పి తప్పించుకు తిరుగుతున్నాడని వెల్లడించారు. సవాల్ స్వీకరించి చర్చకు ఎక్కడకు రావాలో చెప్పాలని కేసీఆర్(kcr) ను బండి సంజయ్ ప్రశ్నించారు.
మరోవైపు సింగరేణి విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం(central government) ప్రైవేటీకరణ చేస్తుందని ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. అసలు సింగరేణి(singareni)లో రాష్ట్ర ప్రభుత్వానిదే 51 శాతం వాటా ఉండగా కేంద్రం ఎలా ప్రైవేటీకరణ చేస్తుందని నిలదీశారు. ఇలా అనేక అంశాల్లో బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందన్నారు. అసలు కేసీఆర్(kcr) సీఎం అయిన తర్వాత తెలంగాణకు ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. అవి చెప్పకుండా కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీపై విమర్శలుచేస్తూ కాలం గడుపుతున్నారని వెల్లడించారు. ఇటీవల తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో సైతం తెలంగాణ అభివృద్ధి పథకాలు సహా అనేక ప్రజా సమస్యలపై చర్చించకుండా మోదీపై ఆరోపణలు చేసి సమావేశాలు పూర్తి చేశారని గుర్తు చేశారు.