కడప: ప్రొద్దుటూరు బంగారు వ్యాపారి శ్రీనివాసులు కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఆయనకు ఆభరణాల తయారీకి ఆర్డర్లు ఇచ్చామని పలువురు చెప్పుకొచ్చారు. అడ్వాన్స్‌లు కూడా ఇచ్చామని, ఇతను పెద్ద మొత్తంలో చీటీలు నిర్వహిస్తున్నాడని తెలిపారు. దాదాపు రూ.10 కోట్ల వరకు ఉంటుందని బాధితులు వాపోతున్నారు. ఆయన జైలుకు పోతే తమ డబ్బులు రావేమోనని భయపడిపోతున్నారు.