»North India Destruction Of Rains 15 People Died And Schools Closed
Rains: వర్షాల విధ్వంసం..15 మంది మృతి, స్కూల్స్ బంద్
దేశ రాజధాని ఢిల్లీతోపాటు సహా ఉత్తర వాయువ్య భారతదేశంలోని అనేక ప్రాంతాలలో కుండపోత వర్షాలు(rains) కురిశాయి. ఈ క్రమంలో పలు ఘటనల్లో 15 మంది మృత్యువాత చెందగా, అనేక చోట్ల కొండచరియలు విరిగిపడి రోడ్లు ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీతోపాటు హర్యానా, నోయిడాలోని అన్ని పాఠశాలలు సోమవారం బంద్ చేశారు.
ఉత్తర, వాయువ్య భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో ఆదివారం వరుసగా రెండో రోజు భారీ వర్షాలు(rains) విధ్వంసం సృష్టించాయి. దీంతో కొండచరియలు విరిగిపడటంతోపాటు పలు చోట్ల భారీగా వరదలు రావడంతో పలు చోట్ల 15 మంది మృతి చెందారు. ఢిల్లీలోని యమునాతో సహా ఉత్తర భారతదేశంలోని అనేక నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నగరాలు, పట్టణాల్లో పలు రహదారులు, నివాస ప్రాంతాలు మోకాళ్ల లోతు నీటిలో మునిగిపోయాయి. ఆకస్మిక వరదలు కొండ ప్రాంతాలలో రోడ్లు కొట్టుకుపోయాయి. ఈ క్రమంలో వాతావరణం మెరుగైన తర్వాత ప్రయాణాలు ప్లాన్ చేసుకోవాలని అధికారులు స్థానిక ప్రజలతోపాటు పర్యాటకులకు కూడా సూచించారు.
ఢిల్లీ(delhi), గురుగ్రామ్. నోయిడాతో సహా అనేక ప్రాంతంలోని నగరాలు, పట్టణాలలో నీటి ఎద్దడి కారణంగా ట్రాఫిక్ కష్టాలు తలెత్తాయి. హత్నీ కుండ్ బ్యారేజీ నుంచి హర్యానా యమునా నదిలోకి 1-లక్ష క్యూసెక్కులకు పైగా నీటిని విడుదల చేయడంతో ఆదివారం ఢిల్లీ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. దేశ రాజధాని ఢిల్లీలోని అన్ని పాఠశాలలను మూసివేస్తున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. కార్పొరేట్ సంస్థలు సోమవారం ఇంటి నుంచి పని చేయాలని పేర్కొన్నారు. దీంతోపాటు దాదాపు 17 రైళ్లను రద్దు చేశామని, మరో 12 రైళ్లను దారి మళ్లించామని, నీటి ఎద్దడి కారణంగా నాలుగు చోట్ల ట్రాఫిక్‌ను నిలిపివేసినట్లు ఉత్తర రైల్వే తెలిపింది.
ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలకు రెడ్ అలర్ట్(red alert) ప్రకటించారు. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, తూర్పు రాజస్థాన్‌లకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయబడిందని వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు జమ్ముకశ్మీర్, లడఖ్, హిమాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలకు భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేయబడ్డాయి. 1982 నుంచి జూలైలో ఒకే రోజులో అత్యధిక వర్షపాతం నమోదైన ఢిల్లీలో, యమునా నీటి మట్టం పెరగడంపై అధికారులు హెచ్చరిస్తున్నారు. చండీగఢ్, హర్యానాలోని అంబాలాలో వరుసగా 322.2 మిమీ, 224.1 మిమీ వర్షపాతం నమోదైంది. హిమాచల్ ప్రదేశ్‌లో కొండచరియలు విరిగిపడిన మూడు వేర్వేరు సంఘటనలలో ఏడు జిల్లాలకు అత్యంత భారీ వర్షాల నేపథ్యంలో రెడ్ అలర్ట్ జారీ చేయగా, అప్పటికే ఐదుగురు మరణించారు.
సిమ్లా జిల్లాలోని కోట్‌ఘర్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో ఇల్లు కూలిన ఘటనలో ఒకే కుటుంబంలోని(family) ముగ్గురు మృతి చెందగా, కులు మరియు చంబా జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. పొరుగున ఉన్న ఉత్తరాఖండ్‌లో, రిషికేశ్-బద్రీనాథ్ జాతీయ రహదారిపై గులార్ సమీపంలో కొండచరియలు విరిగిపడటంతో వారి జీప్ నదిలో పడిపోవడంతో ముగ్గురు యాత్రికులు గంగలో మునిగిపోయారు. జీపులో 11 మంది ఉన్నారని ఎస్డిఆర్ఎఫ్, పోలీసు అధికారులు తెలిపారు. ఐదుగురిని రక్షించామని, మరో ముగ్గురి కోసం అన్వేషణ కొనసాగుతోందని, రెస్క్యూ సిబ్బంది మూడు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారని వారు తెలిపారు. రాష్ట్రంలోని కాశీపూర్ ప్రాంతంలో రెండు ఇళ్లు కూలి దంపతులు మృతి చెందగా, మనవరాలికి గాయాలయ్యాయి. జమ్మూ కాశ్మీర్‌లోని దోడా జిల్లాలో ప్రయాణికుల బస్సును కొండచరియలు విరిగిపడటంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు.
#WATCH | Himachal Pradesh | Latest visuals from Mandi around Victoria Bridge, Panchvakhtra Temple and another bridge that has been damaged following incessant heavy rainfall. pic.twitter.com/8gKOfbvfKT