మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలకృష్ణ మధ్య పోటీ కొత్త కాకపోయినా.. ఇద్దరు పోటీ పడితే ఫ్యాన్స్‌కు భలే కిక్ వస్తుంది. ఎవరు నెగ్గినా, తగ్గినా ఫ్యాన్స్ మాత్రం ఫుల్లుగా ఎంజాయ్ చేస్తుంటారు. సినిమాలు ఎలా ఉన్నా ఓపెనింగ్స్ హోరా హోరీగా ఉంటాయి. పోటీ పడి మరీ మెగా, నందమూరి అభిమానులు థియేటర్లకు క్యూ కడతారు. పోయిన సంక్రాంతికి వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి వార్ ఎలా జరిగిందో అందరికీ తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ ఈ వార్‌ను పీక్స్‌కు తీసుకెళ్లి భారీ విజయాలను అందుకున్నారు. కాకపోతే వీరయ్య కంటే వీరసింహా రేసులో వెనకబడిపోయాడు. కానీ రెండు సినిమాలు మంచి లాభాలను తెచ్చిపెట్టాయి. అయితే ఇప్పుడు మరోసారి చిరు, బాలయ్య బాక్సాఫీస్ దగ్గర పోటీ పడబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మెగాస్టార్, మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’ అనే సినిమా చేస్తున్నడు. ఇది తమిళ్ ‘వేదాళం’ మూవీకి రీమేక్‌గా తెరకెక్కుతోంది. ముందుగా ఈ సినిమాని సమ్మర్లో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు దసరాకి విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట. మరోవైపు ఎన్బీకె 108ని కూడా దసరాకే ప్లాన్ చేస్తున్నారట. యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా.. ప్రస్తుతం షూటింగ్ స్టేజ్‌లో ఉంది. ఇందులో యంగ్ బ్యూటీ శ్రీలీల, బాలయ్య కూతురిగా నటిస్తోంది. దాంతో భారీ అంచనాలున్నాయి. ఒకవేళ బాలయ్య, చిరు పోటీ పడితే మాత్రం.. సంక్రాంతి లాగే దసరా వార్ కూడా ఓ రేంజ్లో ఉంటుందని చెప్పొచ్చు. మరి ఈసారి ఎవరు నెగ్గుతారో చూడాలి.