Mega Star : రీమేకే వద్దంటుంటే.. మెగాస్టార్‌ను పవర్ స్టార్ ఫ్యాన్ అంటున్నారే!
Mega Star : సోషల్ మీడియా పుణ్యమా అని.. పుకార్లకు కొదవ లేకుండా పోతోంది. ఏ చిన్న మ్యాటర్ అయినా సరే.. క్షణాల్లో వైరల్‌గా మారుతోంది. ఇక సినిమా లీకేజీల గురించి అయితే.. ఎంత చెప్పినా తక్కువే.
సోషల్ మీడియా పుణ్యమా అని.. పుకార్లకు కొదవ లేకుండా పోతోంది. ఏ చిన్న మ్యాటర్ అయినా సరే.. క్షణాల్లో వైరల్‌గా మారుతోంది. ఇక సినిమా లీకేజీల గురించి అయితే.. ఎంత చెప్పినా తక్కువే. షూటింగ్ స్పాట్ ఫోటోలను, వీడియోలను లీక్ చేస్తూ.. కథ మొత్తం చెప్పేస్తున్నారు. అయితే ప్రస్తుతం హల్చల్ చేస్తున్న ఓ రూమార్ మాత్రం.. మెగా ఫ్యాన్స్‌కు కాస్త ఇబ్బందిగా ఉంది. వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నుంచి ‘భోళా శంకర్’ అనే రీమేక్ సినిమా రాబోతోంది. మెహర్ రమేష్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. అసలు మెగాస్టార్ ఈ రీమేక్ ఎందుకు చేస్తున్నారనేది.. కొందరు మెగా ఫ్యాన్స్ వాదన. ఇక ఇప్పుడు మెగాస్టార్, పవర్ స్టార్ అభిమానిగా కనిపించబోతున్నాడనే న్యూస్ విని.. మరింత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇందులో నిజమెంతో తెలియదు గానీ.. అసలు మెగాస్టార్, పవన్ ఫ్యాన్‌గా కనిపించడమేంటనే కామెంట్స్ వినిస్తున్నాయి. అయితే అది సినిమా కాబట్టి.. ఏదైనా చేయొచ్చు అనేది కొందరి మాట. అంతేకాదు ఈ సినిమాలో పవన్ గెస్ట్ రోల్ కూడా ఉంటుందట. అయితే ఇవన్నీ కేవలం పుకార్లేనని మాత్రమేనని కొందరు మెగాభిమానులు అంటున్నారు. కానీ భోళా శంకర్‌లో.. చిరు తన హిట్ సాంగ్‌ని తనే రీమిక్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ‘చూడాలని వుంది’ సినిమాలోని ఓ హిట్ సాంగ్‌ను రీమిక్స్ చేస్తున్నట్టు టాక్. అలాగే ఖుషి సినిమాలోని పవన్, భూమికల మధ్య నడుము సీన్‌ను.. శ్రీముఖి, చిరంజీవి పై చిత్రీకరించినట్టు టాక్. అయితే ఇదంతా చూస్తుంటే.. రీమేక్ సినిమా కాబట్టి.. హైప్ కోసం మెహర్ రమేష్ ఇలాంటి సీన్స్ రాసుకున్నాడేమోనని అనిపించక మానదు. ఏదేమైనా పవన్ ఫ్యాన్‌గా చిరంజీవి అంటే.. మెగా ఫ్యాన్స్ ఒప్పుకోరంటే ఒప్పుకోరు.