ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర వాల్తేరు వీరయ్య హవా నడుస్తోంది. బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తోంది. దాంతో ఈ సినిమా సక్సెస్‌ను ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. అయితే త్వరలోనే మెగాస్టార్ మరో రీమేక్‌తో షాక్ ఇవ్వబోతున్నారనే న్యూస్ వైరల్‌గా మారింది. అసలు వాల్తేరు వీరయ్య తర్వాత.. చిరు చేస్తున్న భోళా శంకర్ రీమేక్కే ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడుతున్నారు. వాల్తేరు వీరయ్య సక్సెస్ జోష్‌లో ఉన్న చిరుని.. భోళా శంకర్ ఎక్కడ డ్యామేజ్ చేస్తుందోనని భయపడుతున్నారు. పైగా మెహర్ రమేష్ కూడా లైమ్‌లైట్‌లో లేడు. అయినా కూడా మెగాస్టార్ అతనితో అజిత్ హిట్ మూవీ వేదాళం రీమేక్ చేస్తుండడం విశేషం.
ఈ విషయంలో మెగాఫ్యాన్స్ ఎప్పటికప్పుడు అప్సెట్ అవుతునే ఉన్నారు. రీమేక్‌లు చేయొద్దని మొరపెట్టుకుంటున్నారు. కానీ చిరు మాత్రం తగ్గేదేలే అంటున్నారు. ఇప్పుడు తాజాగా మరో రీమేక్‌ను ముందర పెట్టుకున్నారట మెగాస్టార్. అది కూడా తెలుగులో డబ్బింగ్ కూడా అయినా సినిమా అంటున్నారు. అజిత్ నటించిన ‘విశ్వాసం’ చిత్రం ఇప్పటికీ బుల్లి తెరపై వస్తునే ఉంది. ఈ సినిమానే చిరు రీమేక్ చేయబోతున్నారనేది లేటెస్ట్ రూమర్స్. అంతేకాదు.. ఈ సినిమాను వి.వి. వినాయక్ డైరెక్ట్ చేయబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి గాడ్ ఫాదర్ మూవీ రీమేక్కే వివి వినాయక్ పేరు వినిపించింది. కానీ ఎందుకో వర్కౌట్ కాలేదు. అయితే ఇప్పుడు మాత్రం విశ్వాసం రీమేక్ అంటున్నారు. ఒకవేళ చిరు ఈ రీమేక్ చేస్తే మాత్రం.. మెగాఫ్యాన్స్ నుంచి వ్యతిరేకత వచ్చే ఛాన్స్ ఉంది. కానీ ఇండస్ట్రీలో మాత్రం ప్రచారం జరుగుతోంది. కాబట్టి విశ్వాసం రీమేక్ న్యూస్ నిజమా.. కాదా.. అనేది తెలియాల్సి ఉంది.