»Alert For Residents Of Hyderabad Rising Temperatures
Hyderabad: హైదరాబాద్ వాసులకు అలర్ట్..పెరుగుతోన్న ఉష్ణోగ్రత్తలు
హైదరాబాద్(Hyderabad) లో వేసవి తాపం ప్రారంభమైంది. ఫిబ్రవరిలోనే ఎండలు దంచికొడుతున్నాయి. ఈ వారం ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
హైదరాబాద్(Hyderabad) లో వేసవి తాపం ప్రారంభమైంది. ఫిబ్రవరిలోనే ఎండలు దంచికొడుతున్నాయి. ఈ వారం ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఫిబ్రవరి చివరివారంలో హైదరాబాద్ లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (IMD) అంచనా వేసింది.
హైదరాబాద్(Hyderabad) వాసులకు ఐఎండీ హెచ్చరిక జారీ చేసింది. ఈ వారంలో ఏడు రోజుల పాటు వాతావరణం(Weather) ఎలా ఉంటుందో తెలిపింది. ఈ వారంలో ఫిబ్రవరి 23వ తేదిన హైదరాబాద్ నగరంలో 36 డిగ్రీల సెల్సియస్ తో ఉష్ణోగ్రత్తలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. అలాగే ఫిబ్రవరి 24, 25, 26వ తేదీల్లో గరిష్టంగా 35 డిగ్రీల సెల్సియస్ తో ఉష్ణోగ్రత(Temperature) నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.
హైదరాబాద్ వాతావరణ శాఖ ఆదివారం విడుదల చేసిన వాతావరణ డేటా ప్రకారంగా చూస్తే హైదరాబాద్ లో 33.5 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఇది నగరంలో సాధారణ ఉష్ణోగ్రత(Temperature) నుంచి 0.6 డిగ్రీలు సెల్సియస్ పెరిగిందని తెలిపింది. నిన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లైతే మహబూబ్నగర్లో అత్యధికంగా 35 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత్తలు నమోదైనట్లు ఐఎండీ(IMD) వెల్లడించింది.
వేసవి(Summer)కి ముందే హైదరాబాద్ లో ఇంతటి ఉష్ణోగ్రతలు(Temperature) పెరగడంతో ప్రజలను హెచ్చరించింది. నిన్న కనిష్టంగా 18 డిగ్రీల సెల్సియస్ తో ఉష్ణోగ్రత్తలు నమోదైనట్లు తెలిపింది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం ఈ ఏడాది హైదరాబాద్ లో వేసవి కాలం కఠినంగా ఉండనుంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.