సౌత్ సెంట్రల్ రైల్వే (SCR) కీలక ప్రకటన చేసింది. నగరంలో మూడు రోజుల పాటు 33 ఎంఎంటీఎస్ (MMTS) రైళ్ల సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కొన్ని సాంకేతిక కారణాల దృష్ట్యా మూడు రోజులపాటు పలు ట్రైన్ (Train) రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
సౌత్ సెంట్రల్ రైల్వే (SCR) కీలక ప్రకటన చేసింది. నగరంలో మూడు రోజుల పాటు 33 ఎంఎంటీఎస్ (MMTS) రైళ్ల సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కొన్ని సాంకేతిక కారణాల దృష్ట్యా మూడు రోజులపాటు పలు ట్రైన్ (Train) రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ (CPRO) సి.హెచ్. రాకేష్ ఒక ప్రకటనలో తెలిపారు. లింగంపల్లి
(Lingampally) – హైదరాబాద్, ఫలక్నుమా (Falaknuma) – లింగంపల్లి, సికింద్రాబాద్ – లింగంపల్లి, రామచంద్రాపురం -ఫలక్నుమా, ఫలక్నుమా – హైదరాబాద్ మధ్య తిరిగే సర్వీస్సులను మూడు రోజులు పాటు రద్దు చేసినట్లు దక్షిణ మధ్యరైల్వే తెలిపింది.ప్రయాణీకులు ఈ విషయాన్ని గమనించి ఇతర మార్గాలను ఎంచుకోవాలని సూచించింది. ప్రతీరోజూ ఎంఎంటీఎస్ (MMTS) రైళ్లలో వేలాది మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకుంటారు. కార్మికులతో పాటు రోజువారీ కూలీల నుంచి ఉద్యోగుల వరకు తమతమ పని ప్రదేశాలకు చేరుకోవాలంటే లోకల్ రైళ్లలోనే ఎక్కువగా ప్రయాణిస్తుంటారు. అయితే, శని, ఆదివారాల్లో సెలవు దినాలు కావటం సోమవారం వర్కింగ్ డే కావటంతో ఉద్యోగులు, పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే ప్రయాణీకులు ఎంఎంటీఎస్ రైళ్ల సర్వీసుల రద్దుతో ఇబ్బందులు ఎదుర్కోనున్నారు.హైదరాబాద్ (Hyderabad) లో ఎంఎంటీఎస్ (MMTS) రైళ్లపై ఆధార పడే వారు చాలా మంది ఉంటారనే విషయం తెలిసిందే. విద్య, ఉద్యోగం రీత్యా నగరంలో చాలా మంది ఎంఎంటీస్ సేవలను వినియోగించుకుంటున్నారు. అంతేకాకుండా ఇతర రవాణా సదుపాయలతో పోల్చితే ఎంఎంటీస్ ధర విషయంలో కూడా చాలా తక్కువ కావడం కూడా ఈ రైళ్లకు ఆదరణ పెరగడానికి కారణంగా చెప్పొచ్చు.