హైదరాబాద్(Hyderabad)కు ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టుకు కేంద్రం అమోదం తెలిపిందిని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) వెల్లడించారు. భారతదేశంలో ఈ తరహా ప్రాజెక్టు మొట్టమొదటిదని ఆయన అన్నారు. సర్వే కోసం ఇండియన్ రైల్వే (Indian Railways) రూ.14 వేల కోట్లు కేటాయించిదని ఆయన అన్నారు. RRR, ఔటర్ రింగ్ రైలుతో భాగ్యనగర్‌కు ఎంతో మేలు కలుగుతుందని తెలిపారు. అంతేకాకుండా రైల్ కనెక్టివిటీ లేని ప్రాంతాలకు ఔటర్ రైలు ద్వారా మేలు జరుగుతుందని తెలిపారు.
350 కిలో మీటర్ల RRR రోడ్డు రాష్ట్రంలోని చాలా జిల్లాలను కలుపుతుందని చెప్పుకొచ్చారు. రూ.26 వేల కోట్ల రూపాయలతో రూపొందిస్తున్న ప్రాజెక్టు (Project) ఇది అని తెలిపిన కిషన్ రెడ్డి… భూసేకరణకు 50 శాతం ఖర్చు కేంద్రమే భరించేందకు అంగీకరించిందని తెలిపారు. ప్రాజెక్టు సంబంధించిన వివరాలన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి అందించడం జరిగిందన్నారు. భూసేకరణ (Land Acquisition) కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.500 కోట్లు కేటాయించిందన్నారు. రూట్ ఎలా ఉండాలనే దానికి 99శాతం ఆమోదం లభించిందని వెల్లడించారు. MMTS రెండోదశలో దీనిని పూర్తి చేయాలని చెప్పామన్నారు. తాజ రాజకీయ నేపధ్యంలో కేంద్రమంత్రి హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah)తో భేటీ కానున్నారు