తెలంగాణలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. పొలిటికల్ హీట్ ఎక్కువవుతోంది. తాజాగా కేటీఆర్, అసదుద్దీన్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లో గంటపాటు భేటీ అయ్యారు. ఈ గంట భేటీలో ఏం జరిగిందనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
అందరూ అనుకున్నట్టే జరిగింది. వాళ్లిద్దరూ కలిసారు. వాళ్లు ఎన్నో చెప్పారు. మనం ఎంతో విన్నాం. కట్ చేస్తే వాళ్లిద్దరూ మాత్రం ఏకాంతంగా కలిసారు. అయితే… బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రసిడెంట్… మంత్రి కేటీఆర్(Minister KTR), కలిసారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లో గంటపాటు భేటీ అయ్యారు. ఈ గంట భేటీలో ఏం జరిగిందనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఐతే… BRS-MIM చీకటి పొత్తులంటూ ఓవైపు ఆరోపణలు గుప్పుమంటున్నాయ్. ఇలాంటి సందర్భంలో వీరిద్దరూ పర్సనల్ గా కలవడం చర్చనీయాంశం అయింది.
బంజారాహిల్స్ లో గంటపాటు భేటీ:
తెలంగాణ రాజకీయాలు(Telangana Politics) ఊపందుకున్నాయ్. ఎవరిని ఎవరు తిడుతున్నారో… ఎవరిని ఎవరు కలుస్తున్నారో అర్ధం కావడం లేదు. వాస్తవానికి ఎప్పట్నుంచో అంటే… బీఆర్ఎస్(BRS) అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ.. ఎవరికీ లొంగమని, ఎవరితో పొత్తులు పెట్టుకోమని చెప్తూనే ఉన్నారు బీఆర్ఎస్ నేతలు. కానీ మారుతున్న సమీకరణాలతో చర్చలు జరపాల్సిన అవసరం ఉందనేది…ఆఫ్ ద రికార్డ్ లో ఈ మీటింగ్ సారాంశం. ఎందుకంటే ఇప్పటి ఇప్పుడు మాత్రం MIM తాజా వ్యాఖ్యలతో కాస్తంత బీఆర్ఎస్ లో వణుకు మొదలైందా లేదా అన్నదే ఇప్పుడు తేలాల్సి ఉంది. కానీ… కేవలం ఈ ఒక్క భేటీతో అయితే పొత్తు ఫైనల్ అని ఇరువురు నేతలు చెప్పకపోయినప్పటికీ, మనం అర్ధం చేసుకోవచ్చు. కానీ ప్రతిపక్షాల ఆరోపణల్ని మాత్రం..ఆపలేకపోతున్నాం. వాళ్లు కలవకుండానే ఎన్నో పుకార్లు పుట్టించిన ప్రతిపక్షాలు… ఇప్పుడు ఇద్దరూ డైరెక్ట్ గా కలిసారన్న విషయం తెలిస్తే.. వాళ్ల ఆరోపణలకు, విమర్శలకు హద్దూ పొద్దూ ఉండదు.
ప్రతిపక్షాల ఆరోపణలు ఖండిస్తున్న కేటీఆర్:
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు(Assembly Elections) జరిగితే మజ్లిస్ పార్టీకి 7 సీట్లు ఖాయమని ప్రతి ఒక్కరు అంచనా వేసారు. మొదట్లో కాంగ్రెస్ పార్టీ(Congress Party)కి దగ్గరగా ఉన్న AIMIM…తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి మిత్ర పక్షంగా మారింది. ప్రభుత్వంలో లేకపోయినా.. సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీపై మాత్రం ఏనాడూ విమర్శలు చేయలేదు. ఐతే, తాజాగా నిజామాబాద్ వెళ్లిన ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ(Asaduddin) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీతో పొత్తు ఉండదని స్పష్టం చేశారు. కేవలం ఓల్డ్ సిటీలోనే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా MIM బలంగా ఉన్న ప్రతీ చోటా.. పోటీ చేస్తామని తెల్చేసిన నేపధ్యంలో…. వీరు ఇద్దరు భేటీ ఆసక్తికరంగా మారింది.
BRS-MIM పొత్తులంటూ ఆరోపణలు:
ఎన్నికల అనంతరమే BRS పార్టీతో కలిసి నడవాలా లేదా అనే విషయం తేలుస్తామని చెప్పారు. మా క్రికెట్ మేం ఆడతాం.. బ్యాటింగ్ చేసి మా స్కోర్ మేం తెచ్చుకుంటాం. ఆ తర్వాత ఎవరిని ఔట్ చేయాలనేది నిర్ణయిస్తామంటూ… సంచలన వ్యాఖ్యలు చేశారాయన. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని.. పవర్ మీ చేతిలో ఉందని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారంటూ బీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకపడ్డారు. ఐతే…పాట్నా ప్రతిపక్షాల మీటింగ్‌కు తనకు ఆహ్వానం లేదని అసదుద్దీన్ స్పష్టం చేశారు. 2024 లో మోడీని ఓడించేందుకు మేము వ్యక్తిగతంగా శాయశక్తులా ప్రయత్నం చేస్తామని తెలిపారు. గత అసెంబ్లీ సమావేశాల్లో అక్బరుద్దీన్ , కేటీఆర్ మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా అక్బరుద్దీన్ తాము తెలంగాణలో యాభై స్థానాల్లో పోటీ చేస్తామనిప్రకటించారు. ఇప్పుడు అసదుద్దీన్ కూడా అదే తరహాలో ప్రకటనలుచేస్తూండటం ఆసక్తికరంగా మారింది. సరే… ఏదేమైనా… వీరిద్దరి భేటీ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.