రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు మే 13న జరుగుతున్నాయి. అయితే ఓటు హక్కు నమోదు చేసుకునేందుకు ఏప్రిల్ 15 వరకు అవకాశం ఇస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది.
Vote: రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు మే 13న జరుగుతున్నాయి. అయితే ఓటు హక్కు నమోదు చేసుకునేందుకు ఏప్రిల్ 15 వరకు అవకాశం ఇస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ఏప్రిల్ 15లోగా జాబితాలో ఓటు ఉందో? లేదో? పరిశీలించుకోవాలి. ఓటు లేకపోతే నమోదు చేసుకోవాలి. ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్లు.. ఇప్పటి వరకు ఓటు నమోదు చేసుకోని వారు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం స్పష్టం చేస్తోంది. ఓటరు నమోదు అనేది నిరంతర ప్రక్రియ.
ఏటా జనవరి, ఏప్రిల్, జులై, అక్టోబరు నెల ఒకటో తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన వారు ఓటుకు దరఖాస్తు చేస్తుకోవచ్చని ఎన్నికల సంఘం ప్రకటించి ఎప్పటికప్పుడు జాబితాలు వెలువరిస్తోంది. అయితే జాబితాను తాజాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రకటించింది. అందులో పేరు లేనివాళ్లు కొత్తగా నమోదు చేసుకోవాలనుకునే వారు ఫారం-8 దరఖాస్తును ఆన్లైన్లో కానీ నియోజకవర్గ ఎన్నికల అధికారి, సహాయ ఎన్నికల అధికారి లేదా పోలింగ్ అధికారికి ప్రత్యక్షంగానైనా అందజేయవచ్చు. మార్పులు చేసుకునే అవకాశం కూడా ఉంది. సెల్ఫోన్ ద్వారా ఓటు నమోదు చేసుకోవాలంటే Voter Help Appలో చేసుకోవచ్చు.