»Narendra Modi What Drives Me Is The Sense Of Country Is Important
Narendra Modi: దేశం ముఖ్యం అనే భావనే నన్ను ముందుకు నడిపిస్తోంది
ప్రస్తుతం ప్రపంచమంతా అభివృద్ధి చెందుతున్న భారత్ వైపు చూస్తోందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. నిన్న ఇండియా టూడే సదస్సులో ప్రధాని మాట్లాడుతూ.. దేశం ముఖ్యం అనే భావన తనను ముందుకు నడిపిస్తుందని, వారిది మాత్రం కుటుంబం ముఖ్యమనే దృక్పథమని తెలిపారు.
Narendra Modi: ప్రస్తుతం ప్రపంచమంతా అభివృద్ధి చెందుతున్న భారత్ వైపు చూస్తోందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. నిన్న ఇండియా టూడే సదస్సులో ప్రధాని మాట్లాడుతూ.. దేశం ముఖ్యం అనే భావన తనను ముందుకు నడిపిస్తుందని, వారిది మాత్రం కుటుంబం ముఖ్యమనే దృక్పథమని తెలిపారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మళ్లీ తన ప్రభుత్వమే వస్తుందని మోదీ భరోసా వ్యక్తం చేశారు. ఇంకో అయిదేళ్లలో ప్రజలు నిర్ణయాత్మక విధానాలు, నిర్ణయాలు చూస్తారని, ఆ దిశగా తాను ఇప్పటికే పని ప్రారంభించినట్లు తెలిపారు. ప్రగతిని కొత్త పుంతలు తొక్కిస్తామని, ప్రపంచం సుస్థిరమైన, సమర్థమైన, దృఢమైన భారత్‌ను చూస్తుందని చెప్పడానికి వచ్చే అయిదేళ్లు గ్యారంటీ అన్నారు.
తమ ప్రభుత్వం అవినీతిని ఎంతమాత్రం సహించలేదని, దర్యాప్తు సంస్థలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చిందని ప్రధాని తెలిపారు. ఈ కారణంగానే కొందరికి కడుపుమంటగా ఉందంటూ దర్యాప్తు సంస్థలను మోదీ సర్కారు దుర్వినియోగం చేసిందని విమర్శకులకు సమాధానమిచ్చారు. 2014 వరకు రూ.5000 కోట్లు మాత్రమే సీజ్ చేసిన ఈడీ.. గత పదేళ్లలో రూ.లక్ష కోట్లపైగా ఆస్తులను అటాచ్ చేసి ఆయా నేరాల్లో ప్రమేయం ఉన్నవాళ్లను అరెస్టు చేసినట్లు తెలిపారు.