some trains are closed upto September 11th 2023 vijayawada division
SCR: దేశవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు రవాణా వ్యవస్థ కూడా స్తంభించిపోయింది(transport system is paralyzed.). చాలా చోట్ల తారు రోడ్లు కొట్టుకుపోగా, వరదలకు వానకట్టలు తెగిపోతున్నాయి. రైల్వే వ్యవస్థకు కూడా అంతరాయం( railway system disrupted) కలిగింది. రైల్వే ట్రాకుల అభివృద్ధి పనుల వల్ల పలు రైల్వే స్టేషన్ల మధ్యలో దాదాపు 36 రైళ్లను రద్దు(Cancellation of 36 trains) చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే (SCR) అధికారులు అధికారికంగా ప్రకటించారు. దీనిలో భాగంగా తిరుపతి-కట్పాడి స్టేషన్ల మధ్య రెండు రైళ్లను ఈ నెల 31 నుంచి ఆగస్టు 6 వరకు రద్దు చేస్తున్నట్లుగా వెల్లడించారు. అలాగే హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే పరిధిలో కాజీపేట్-డోర్నకల్, విజయవాడ-డోర్నకల్, భద్రాచలం రోడ్-విజయవాడ, బల్హార్ష-విజయవాడ, కాజీపేట్-సిర్పూర్టౌన్, బల్హార్ష-కాజీపేట్, సిర్పూర్టౌన్-భద్రాచలం రోడ్, సికింద్రాబాద్-వికారాబాద్, నిజామాబాద్-కరీంనగర్ వంటి 20 స్టేషన్లలో రైళ్లను ఈ నెల 31 నుంచి ఆగస్టు 7 వరకు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ గుంటూరు డివిజన్(Guntur Divisional) రైల్వే పరిధిలో గుంటూరు-దోన్, కాచిగూడ- నడికుడి, విజయవాడ-గుంటూరు, మాచర్ల-గుంటూరు, నడికుడి-మాచర్ల వంటి స్టేషన్ల మధ్య పది రైళ్లను కూడా రద్దు చేశారు. విజయవాడ డివిజనల్ రైల్వే పరిధిలో 14 స్టేషన్లలో కలిపి విజయవాడ-బిట్రగుంట, చెన్నై-బిట్రగుంట, రాజమండ్రి- విశాఖపట్నం, విజయవాడ-గూడూరు, విజయవాడ-ఒంగోలు వంటి పలు స్టేషన్ల మధ్య 14 రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ సబర్భన్ ఆధ్వర్యంలో నడిచే ఎంఎంటీఎస్ లోకల్ రైళ్లకు సంబంధించి మొత్తం 22 సర్వీసులను ఈ నెల 31 నుంచి ఆగస్టు 6 వరకు రద్దు చేసినట్లు శుక్రవారం ఎస్సీఆర్ ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. లింగంపల్లి-హైదరాబాద్(Lingampally-Hyderabad), లింగంపల్లి-ఫలక్నుమా, రామచంద్రాపురం-ఫలక్నుమా వంటి స్టేషన్ల మధ్య లోకల్ రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. కొనసాగుతున్న రైల్వే అభివృద్ధి పనుల వల్ల ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.