karthika masam last monday december 11th 2023 devotees rush in telugu states
ఈరోజు కార్తీక మాసం(karthika masam) చివరి సోమవారం సందర్భంగా రాష్ట్రంలోని ప్రముఖ శివాలయాలకు భక్తులు పోటెత్తారు. నేడు మంచి పర్వదినం కావడంతో ఉదయం తెల్లవారుజాము నుంచి భక్తులు దేవాలయాలకు బయలుదేరి వెళ్లారు. ఈ క్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి, మొగిలి, కైలాసకోన, తిరుపతిలోని కపిలతీర్థం, సదాశివకోన, తలకోనలోని ప్రసిద్ధ శివాలయాలకు భక్తుల పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ క్రమంలో భక్తుల రద్దీని ఎదుర్కొనేందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. మరోవైపు వన్ టౌన్ శివాలయం, కృష్ణలంకలోని చల్లపల్లి బంగ్లా సమీపంలోని శివాలయం, సత్యనారాయణపురంలోని రామకోటి, దుర్గా అగ్రహారంలోని శరభయ్య గుల్లు, యనమలకుదురు శివాలయం తదితర ఆలయాల్లో రద్దీ నెలకొంది. పీఠాధిపతుల దర్శనం కోసం భక్తులు ఆలయాలకు బారులు తీరారు.
మరోవైపు తెలంగాణ(telangana)లోని కాళేశ్వరం, వెయి స్తంభాల ఆలయం, రామప్ప, కోటిలింగాల, కీసర సహా అనేక శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. ఈ నేపథ్యంలో శివాలయాలు మొత్తం ఆధ్యాత్మికత శోభను సంతరించుకున్నాయి. ఈ క్రమంలో భక్తులు పెద్ద ఎత్తున శివాలయాలను దర్శించుకుని శివుని దివ్య సన్నిధిలో సాంత్వన చెందుతున్నారు. ఈ పవిత్ర మాసంలో చివరి సోమవారం కావడంతో అనేక మంది భక్తులు ఆలయాలకు పెద్ద ఎత్తున చేరి వారి మొక్కలు చెల్లించి అరటి చెట్ల కొమ్మలపై మట్టి దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కార్తీక మాసం అనేది సాంప్రదాయ హిందూ తెలుగు క్యాలెండర్లో ఎనిమిదవ మాసం. ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్(andhra pradesh)లలో ఎక్కవగా అనుసరించబడుతుంది. కార్తీక మాసం 2023 నవంబర్ 14 నుంచి డిసెంబర్ 12 వరకు ఉంటుంది. ఈ మాసంలో ప్రధానంగా శివుడు, విష్ణువు ఇద్దరికీ ప్రజలు ప్రత్యేక పూజలు చేసి తమ కోరికలు తీరాలని కోరుకుంటారు.