»Good News For Meat Lovers Chicken Price Has Reduced Drastically Hyderabad Rs Kilo 150
Chicken price: మాంసాహార ప్రియులకు శుభవార్త..భారీగా తగ్గిన చికెన్ ధర
మాంసాహార ప్రియులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. అది ఏంటంటే ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా చికెన్ ధరలు భారీగా తగ్గిపోయాయి. కిలో చికెన్ దాదాపు రూ.300 ఉండగా..అది కాస్తా ప్రస్తుతం సగానికి వచ్చింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
Good news for meat lovers chicken price has reduced drastically hyderabad rs kilo 150
నాన్ వెజ్ ప్రియులకు గుడ్ న్యూస్. ఎందుకంటే చికెన్ రేటు(chicken rate) హైదరాబాద్‌తోపాటు మరికొన్ని ప్రాంతాల్లో దాదాపు సగానికి తగ్గింది. ఇకపై రోజు చికెన్ తెచ్చుకుని ఎంచక్కా ఆరగించవచ్చు. కొన్ని రోజుల క్రితం చికెన్ కిలోకు రూ. 250 నుంచి రూ. 300 వరకు విక్రయించారు. కానీ ఇప్పుడు ఇదే మాంసం ధర విత్ స్కిన్ అయితే కిలోకు రూ.150 ధర పలుకుతుండగా..స్కిన్ లెస్ రూ.170కి అమ్ముతున్నారు.
భారతదేశంలో కార్తీక మాసం ప్రారంభం కావడంతోనే ఈ మాసం రేట్లు తగ్గాయని వ్యాపార వర్గాలు అంటున్నాయి. ఈ కార్తీక మాసం(karthika masam)లో చాలా మంది ఆలయాలకు వెళ్లి పూజలు చేస్తారు. ఈ నేపథ్యంలో అనేక మంది మాంసాహారాన్ని మానేస్తున్నారు. మరోవైపు వినియోగంలో పతనం, విస్తారమైన వర్షాల కారణంగా వాతావరణం చల్లబడి పక్షుల బరువు పెరగడంతో వ్యాపారస్తులు అటువంటి పక్షులను వెంటనే విక్రయిస్తున్నారు. కానీ నగరంలో మాత్రం గుడ్ల ధరలు యాథావిధంగా కొనసాగుతున్నాయి.
రానున్న రోజుల్లో ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని దుకాణదారులు చెబుతున్నారు. నగరానికి శంషాబాద్, షాద్‌నగర్, కందుకూరు, కొత్తూరు, ఇబ్రహీంపట్నం, మేడ్చల్, రంగారెడ్డి, హయత్‌నగర్ తదితర ప్రాంతాల నుంచి కోళ్ల సరఫరా జరుగుతుంది. మరోవైపు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లలో కూడా ఈ పతనం కనిపిస్తుంది. వచ్చే నెలలో ఫంక్షన్లు/వివాహాలు ఉన్న నేపథ్యంలో చికెన్ రేట్లు తగ్గడం పట్ల వ్యాపారస్తులు(business people)ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.