»Shock For Brs Party Support For Telangana Muslim Jac To Congress Party
BRSకు షాక్..తెలంగాణ ముస్లిం జేఏసీ కాంగ్రెస్‌కు మద్దతు
తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ ముస్లిం సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ ముస్లింలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని తెలిపింది.
Shock for BRS party Support for Telangana Muslim JAC to Congress party
వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు తెలంగాణ ముస్లిం సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ (Telangana Muslim JAC) మద్దతు ప్రకటించింది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ముస్లింలు కాంగ్రెస్‌కు ఓటు వేసి తమ ఓటు సత్తా చాటాలని జేఏసీ విజ్ఞప్తి చేసింది. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైతే ముస్లింల జేఏసీ డిక్లరేషన్ డిమాండ్లను అమలు చేసేందుకు కాంగ్రెస్‌పై ఒత్తిడి తీసుకురావడానికి ఈ నిర్ణయం సాధనంగా ఉపయోగపడుతుందని తెలిపింది. ముస్లిం జేఏసీ పెట్టిన డిమాండ్లను పరిష్కరించడంలో బీఆర్ఎస్ మేనిఫెస్టో విఫలమైంది. ఎన్నికల ప్రచారంలో 12 శాతం రిజర్వేషన్‌తోపాటు ముస్లింలకు ఇచ్చిన వాగ్దానాలను జేఏసీ నేతలు ప్రస్తావించడం లేదన్నారు.
మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో BRS మేనిఫెస్టో గతంలో తాము పెట్టిన డిమాండ్లను పరిష్కరించడంలో విఫలమైందని JAC విమర్శించింది. అన్ని డిమాండ్లు పట్టించుకోవడం లేదని, ఎన్నికల ప్రచారంలో ముస్లిములకు చేసిన వాగ్దానాలను ప్రస్తావించలేదని పేర్కొంది. మరోవైపు ముస్లిం జెఎసి డిక్లరేషన్ ద్వారా పేర్కొన్న లక్ష్యాలను కాంగ్రెస్ ప్రస్తావించిందని గుర్తు చేసింది. ముస్లిం జెఎసి పేర్కొన్న ఎనిమిది ప్రధాన డిమాండ్లను కూడా కాంగ్రెస్ మైనారిటీ డిక్లరేషన్‌లో పొందుపరిచిందని వెల్లడించింది.
కాంగ్రెస్ మైనారిటీ డిక్లరేషన్ డ్రాఫ్టింగ్ కమిటీ మమ్మల్ని సంప్రదించింది. ముస్లిం సమాజానికి చెందిన ప్రతి ప్రతినిధి హాజరైన సభకు మాకు ఆహ్వానం పంపబడింది. ముస్లిం జెఎసి డిక్లరేషన్‌లో పేర్కొన్న లక్ష్యాలను జాగ్రత్తగా అంచనా వేయడానికి కాంగ్రెస్ తన నిబద్ధతను వ్యక్తం చేసింది. ఈ పరిణామాలన్నింటినీ నిశితంగా గమనించిన తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ముస్లిం సంఘాల రాష్ట్ర కమిటీ, జేఏసీ తరపున కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నామని వెల్లడించారు.
జేఏసీ రాష్ట్ర కన్వీనర్ సయ్యద్ సలీమ్ పాషా, కో-కన్వీనర్ షేక్ యూసుఫ్ బాబా మాట్లాడుతూ వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం సమాజానికి కట్టుబడిన హామీలను నెరవేర్చడంపైనే ఆధారపడి ఉంటుందని అన్నారు. జేఏసీ గత రెండేళ్లుగా పనిచేస్తూ తెలంగాణ ముస్లిం డిక్లరేషన్ పేరుతో కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. జూలై 9, 2023న విడుదలైన ముస్లిం డిక్లరేషన్‌లో ముస్లిం సమాజం పురోభివృద్ధి పెంపొందించే లక్ష్యంతో 22 ప్రధాన డిమాండ్లు ఉన్నాయి.