»Tsrtc To Run Special Service Buses In Karthika Masam
Karthika masam:స్పెషల్..శివాలయాల చెంతకు TSRTC బస్సులు
కార్తీక మాసం(karthika masam 2023) సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక ప్యాకేజీని అనౌన్స్ చేసింది. అది ఏటంటే రాష్ట్రంలోని ప్రముఖ శివాలయాలను సందర్శించే విధంగా బస్సులను నడపాలని నిర్ణయించింది. ఈ బస్సులు ప్రతి ఆదివారం హైదరాబాద్ నుంచి మొదలవుతాయని ప్రకటించారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
tsrtc to run special service buses in karthika masam
పవిత్రమైన కార్తీక మాసం(karthika masam) వచ్చేస్తుంది కాబట్టి ప్రముఖ దేవాలయాలు, ఇతర ప్రాంతాలను సందర్శించేందుకు వీలుగా తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటించింది. ఇవి వారాంతం నుంచి అమలుల్లోకి వస్తాయి. కార్తీక మాసం సందర్భంగా వేములవాడ, కాళేశ్వరం, రామప్పగుడి, వేయి స్తంభాల గుడి, పాలకుర్తి తదితర శివాలయాలకు ప్రయాణికులను చేరవేసేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. ఇటివల దసరా పండుగ సందర్భంగా పలు ఆఫర్ల ప్రకటించిన TSRTC..అదే జోరుతో మళ్లీ తాజాగా ఈ ప్రతిపాదనను ప్రకటించడం విశేషం.
ఈ బస్సులు కార్తీక పౌర్ణమికి ఒకరోజు ముందు ప్రతి ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్(hyderabad) నుంచి బయలుదేరి సోమవారం రాత్రి దర్శనాలు ముగించుకుని తిరిగి వస్తాయి. ఛార్జీలు ఎక్స్ప్రెస్కు రూ.1500, రూ.1900 సూపర్ లగ్జరీ, రాజధానికి రూ.2400. మరోవైపు ఆంధ్రప్రదేశ్లోని అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, పంచారామ క్షేత్రాలకు కూడా ప్రత్యేక బస్సులు నడపనున్నారు. ఈ బస్సులు ప్రతి ఆదివారం అంటే పౌర్ణమికి ముందు రోజు సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరుతాయి. ఆ తర్వాత మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి హైదరాబాద్కు చేరుకుంటారు.