»Young Girl Not Accepting Marriage Young Boy Murder With A Rod Hit At Delhi
Hit rod: పెళ్లికి నో చెప్పిందని..రాడ్ తో కొట్టి
పట్టపగలు ఓ యువకుడు(28) తనతో పెళ్లికి ఒప్పుకొలేదని ఓ యువతిని(25) రాడ్ తో కొట్టి హత్య చేశాడు. ఈ దారుణ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
దేశ రాజధాని ఢిల్లీ(delhi)లో మరో దిగ్భ్రాంతికరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. దక్షిణ ఢిల్లీలోని మాళవియా నగర్ ప్రాంతంలో శుక్రవారం ఓ పార్కులో కూర్చున్న విద్యార్థిని(25)తలపై పట్టపగలు రాడ్‌తో దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. ఆ అమ్మాయి ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన కమల నెహ్రూ కాలేజీ విద్యార్థినిగా గుర్తించారు. అయితే దాడి చేసి దుండగుడు పారిపోయాడు. ఆ క్రమంలో వెంటనే గమనించిన పలువురు బాలికను ఆసుపత్రికి తరలించగా, ఆమె మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. ఈ ఘటన ఢిల్లీలోని అరబిందో కళాశాల సమీపంలో మాల్వియా నగర్ పోలీస్ స్టేషన్‌కు 200 మీటర్ల దూరంలో జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు త్వరిత గతిన చర్యలు తీసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత తదుపరి విచారణలో నిందితుడు చెప్పిన విషయం వెలుగులోకి వచ్చింది. అయితే నిందితుడు సంగం విహార్‌కు చెందిన ఇర్ఫాన్ (28)గా పోలీసులు గుర్తించారు. బాధితురాలు అతనికి బంధువని పోలీసులు(police) తెలిపారు. గత కొన్ని రోజులుగా ఇర్ఫాన్ ఆ యువతిని పెళ్లి చేసుకోవాలని వేధించేవాడు.
అయితే ఆమె ఈ విషయం తన కుటుంబంలో చెప్పగా ఇర్ఫాన్‌కు ఆదాయం సరిగా లేకపోవడంతో మహిళ కుటుంబ సభ్యులు(family) పెళ్లికి నిరాకరించారు. అతను ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీకి డెలివరీ బాయ్(delivery boy)గా పనిచేస్తున్నాడు. దీంతో ఆమె అతనికి దూరంగా ఉంది. ఆ క్రమంలో శుక్రవారం(జులై 28న) కూడా తనతో మాట్లాడాలని ఆ యువకుడు ఆమెను వెంబడించాడు. కానీ ఆమె అందుకు నిరాకరించింది. దీంతో కక్ష్య పెంచుకున్న ఆ యువకుడు దాడి చేసినట్లు ఒప్పుకున్నాడని పోలీసులు పేర్కొన్నారు. అంతేకాదు విచారణలో ఇర్ఫాన్ మూడు రోజుల ముందే హత్యకు ప్లాన్ చేసినట్లు పోలీసులకు తెలిపాడు. బాధితురాలు కమల నెహ్రూ కాలేజీలో ఈ ఏడాది గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిందని, మాల్వియా నగర్ ప్రాంతంలో స్టెనో కోచింగ్ చేస్తోందని ఓ అధికారి తెలిపారు. ఈ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్ స్వాతి మలివాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. “మాల్వీయా నగర్ వంటి నాగరిక ప్రాంతంలో ఒక అమ్మాయిని రాడ్‌తో కొట్టి చంపారు. ఢిల్లీ చాలా సురక్షితం కాదని, ఇది ఎవరికీ పట్టింపు లేదని వార్తాపత్రిక నివేదికలు, అమ్మాయిల పేర్లు మార్చబడ్డాయని ఆమె ట్వీట్ చేశారు.