ఓ సరస్సులో పరిమితికి మించిన ప్రయాణికులతో వెళ్తున్న పడవ ఆకస్మాత్తుగా నీటి మునిగింది. ఆ ఘటనలో 26 మంది జలసమాధి అయ్యారు. విషయం తెలుసుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని చర్యలు చేపడుతున్నారు.
Philippines: చాలా సార్లు ఓవర్ లోడ్ అయిన వాహనాలు రోడ్డుమీద పడిపోవడం చూస్తుంటాము. కొన్ని సార్లు ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. ఓవర్ లోడ్ కారణంగా పడవ నీటమునగడం (Boat sinking) ఎక్కడైన విన్నారా.. ఇదే సంఘటన ఫిలిప్పీన్స్(Philippines) రాజధాని సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పరిమితికి మించి ప్రమాణికులతో వెళ్తున్న పడవ గురవారం బోల్తాపడింది. ఈ ఘటనలో 26 మంది దుర్మరణం(bad death) పాలయ్యారు. రాజధానిలోని సమీప సరస్సులో ప్రయాణిస్తుండగా.. బలమైన గాలులు విచాయని దానికి తట్టుకోలేక నౌక మునిగిపోయిందని, 40 మందిని రక్షించామని కోస్ట్ గార్డ్ అధికారులు తెలిపారు.
ప్రమాదానికి గురయైన పడవలో మొత్తం 40 మంది ప్రయాణికులకు మాత్రమే అనుమతి ఉందని, అలాంటింది లాభార్జన కోసమని దాని సామర్థ్యానికి మించిన ప్రయాణికులు ఉన్నారిని అధికారులు తెలిపారు. అయితే పడవలో మొత్తం ఎంత మంది ప్రయాణికులు ఉన్నారనేది ఇంకా కచ్చితంగా తెలియదన్నారు. అయితే ప్రయాణికుల జాబితాలో మాత్రం కేవలం 22 మంది పేర్లు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో గాలింపు, రెస్క్యూ, రిట్రీవల్ ఆపరేషన్లు కొనసాగుతున్నాయని వెల్లడించారు. పడవ కెప్టెన్, ఆపరేటర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.