హైదరాబాద్ (Hyderabad) మహానగరాన్ని డల్లాస్ చేస్తామంటూ, సింగపూర్ చేస్తామని సీఎం కేసీఆర్ గొప్పలు చెప్పారని. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ (NVSS Prabhakar) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గత నాలుగు రోజులుగా కురిసిన భారీ వర్షాలతో రాష్ట్రమంతా అతలాకుతలమైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వాతావరణ శాఖ హెచ్చరించినప్పటికీ ప్రభుత్వం ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోలేదని ఆయన అన్నారు. హైదరాబాద్లో మిషన్ కాకతీయ(Mission Kakatiya)అమలు ఏమైంది? నగరంలోని 300 చెరువుల్లో ఇప్పటికే పూడిక తీసి ఉంటే నీటి నిల్వ సామర్థ్యం పెరిగేది. కానీ ప్రభుత్వం అలా చేయలేదు.
ఆక్రమణలను పట్టించుకోలేదన్నారు.బీఆర్ఎస్ (BRS) అధికారంలోకి వచ్చిన తర్వాతనే నగరం మునుగుతుందని, ఇందుకు బీఆర్ఎస్ నేతల కబ్జాలే కారణమని ఆరోపించారు.కబ్జాల వల్ల చెరువుల్లో ఉండాల్సిన నీళ్లు బస్తీల్లో ఉంటున్నాయి. నగరంలోని అనేక ప్రాంతాలు మునిగిపోవడానికి రాష్ట్ర ప్రభుత్వం కారణం కాదా? వరద నష్టం, తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన ముఖ్యమంత్రి కేసీఆర్ (CMKCR) వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి. రాజకీయాలు మానేసి ఈ ఐదు నెలలైనా ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ డిమాండ్ చేశారు