»Earthquake Of Magnitude 5 9 Strikes The Philippines Evacuation Order In Manila
Earthquake: ఫిలిప్పీన్స్లో భూకంపం.. రాజధానిని ఖాళీ చేయాలంటూ ఆదేశాలు
వరుస భూకంపాలతో ఆగ్నేయాసియా దేశమైన ఫిలిప్పీన్స్ వణుకుతోంది. గత రెండు, మూడు రోజుల నుంచి దేశంలోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవిస్తున్నాయి. దీంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
Earthquake: వరుస భూకంపాలతో ఆగ్నేయాసియా దేశమైన ఫిలిప్పీన్స్ వణుకుతోంది. గత రెండు, మూడు రోజుల నుంచి దేశంలోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవిస్తున్నాయి. దీంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా, మంగళవారం దేశంలోని లుజోన్లో 5.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంపం కారణంగా రాజధాని మనీలాలోని భవనాలను ఖాళీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తాజాగా భూమి లోపలి భాగంలో 79 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. రాజధానిలోని సెనేట్, ప్రెసిడెన్షియల్ ప్యాలెస్, మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్ భవనాలను ఉద్యోగులు ఖాళీ చేయించారు. విద్యార్థులు యూనివర్సిటీల నుంచి బయటకు వచ్చారు. అంతకుముందు శనివారం 6.2 తీవ్రతతో భూకంపం వచ్చింది.
ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, జపాన్ వంటి దేశాలు పసిఫిక్ మహాసముద్రంలోని ‘రింగ్ ఆఫ్ ఫైర్’ జోన్లో ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఎక్కువ అగ్నిపర్వతాలు ఉన్నాయి. భూమి లోపలి భాగంలో టెక్టోనిక్ ప్లేట్ల కదలికలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఆ ప్రాంతంలో తరచుగా భూకంపాలు వస్తుంటాయి. సునామీ ముప్పు కూడా ఎక్కువే.