30 Years Prudhvi : లక్ష్మీ పార్వతి కామెంట్స్ పై 30ఇయర్స్ పృథ్వీ రియాక్షన్
30 Years Prudhvi : సినీ నటుడు తారకరత్న తుదిశ్వాస విడిచారు. లోకేష్ పాదయాత్రలో పాల్గొనడానికి వచ్చిన ఆయన గుండెపోటుకు గురైన విషయం తెలిసిందే. 23 రోజులు వెంటిలేటర్ పై చికిత్స పొందిన ఆయన శనివారం సాయంత్రం కన్నుమూశారు. ఆయన మృతి పై అందరూ విచారం వ్యక్తం చేశారు.
సినీ నటుడు తారకరత్న తుదిశ్వాస విడిచారు. లోకేష్ పాదయాత్రలో పాల్గొనడానికి వచ్చిన ఆయన గుండెపోటుకు గురైన విషయం తెలిసిందే. 23 రోజులు వెంటిలేటర్ పై చికిత్స పొందిన ఆయన శనివారం సాయంత్రం కన్నుమూశారు. ఆయన మృతి పై అందరూ విచారం వ్యక్తం చేశారు.
అయితే… లక్ష్మీ పార్వతి మాత్రం సంచలన కామెంట్స్ చేశారు. తారకరత్న ఎప్పుడో చనిపోతే తమ స్వార్థ రాజకీయాలకోసం ఆసుప్రతిలో ఉంచి మరణవార్తను ఇన్నిరోజులు దాచిపెట్టారంటూ చంద్రబాబుపై ఆమె ఆరోపణలు చేశారు. ఆ కామెంట్స్ రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. కాగా…ఆమె కామెంట్స్ కి 30 ఇయర్స్ పృథ్వీ కౌంటర్ ఇచ్చారు. తారకరత్న మరణంపై లక్ష్మీపార్వతి చేసిన వ్యాఖ్యలు తప్పు అని, ఆ దరిద్రపు వ్యాఖ్యలు గురించి మాట్లాడటం అనవసరం అని పృథ్వీ అన్నారు.
‘నందమూరి కుటుంబం గురించి ఆమెకు ఎప్పటినుంచి తెలుసో నాకు తెలియదు. కానీ, నాకు చిన్నప్పటి నుంచి వారితో అనుబంధం ఉందని అన్నారు. తారకరత్న ఎంతో మంచివాడని, వెంకటాద్రి సినిమాకి తారకరత్నతో కలిసి నేను నటించానని పృథ్వీ తెలిపారు. ఏపీ రాజకీయాలపై ప్రస్తావిస్తూ.. మనోభావాలు దెబ్బతిని కన్నా లక్ష్మీనారాయణ బయటకు వచ్చి ఉంటారని’ అన్నారు.