»Professor Danced With College Girl Jesus And Mary College
Viral Video: అమ్మాయిలతో కలిసి డాన్స్ చేసిన ప్రొఫెసర్లు
కాలేజ్ అమ్మాయిలు డాన్స్ చేస్తుంటే మధ్యలో మహిళా ప్రొఫెసర్లు కూడా వచ్చి జాయిన్ అయితే ఎలా ఉంటుంది. క్రేజీ కాదా. అవును. ఈ వీడియోలో అదే జరిగింది. ఢిల్లీలోని జీసెస్ & మేరీ కాలేజ్ విద్యార్థినులు ఫ్లాష్ మాబ్ చేస్తున్న క్రమంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
పలువురు అమ్మాయిలు(girls) కలిసి ఒకేచోట డాన్స్ చేస్తే మాములుగా ఉండదు. ప్రస్తుతం పలువురు బృందాలుగా ఏర్పడి అనేక చోట్ల డాన్స్ చేస్తున్న సందర్భాలు ఇటీవల కాలంలో ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. అలాంటిదే ఇటీవల ఢిల్లీ(delhi)లో వెలుగులోకి వచ్చింది. ఓ ఫ్లాష్ మాబ్(flash mob)లో భాగంగా కాలేజ్ అమ్మాయిలు డాన్స్(dance) చేస్తున్న క్రేజీ వీడియో వెలుగులోకి వచ్చింది. అయితే వీడియోలో అమ్మాయిలు హుక్ స్టెప్ వేస్తూ జూమ్ జో పఠాన్ పాఠకు డాన్స్ చేస్తున్నారు. ఆ క్రమంలో మహిళా ప్రొఫెసర్లు(Professors) కూడా వారితో పాటు జాయిన్ అయి డాన్స్ చేశారు. దీంతో అక్కడ ఉన్న విద్యార్థినులు అందరూ ఒక్కసారిగా కేకలు వేశారు. ప్రొఫెసర్లు డాన్స్ చేస్తున్న క్రమంలో క్లాప్స్ కొడుతూ సందడి చేశారు.
ఈ వీడియోను డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్, జీసస్ & మేరీ కాలేజీ, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ అధికారిక ఇన్ స్టా(Instagram) పేజీలో వీడియోను పోస్ట్ చేశారు. కాలేజ్ అమ్మయిలు(college girls) ఫ్లాష్‌మాబ్ చేస్తున్నక్రమంలో ప్రొఫెసర్లు(Professors) కూడా జాయిన్ ఈ వీడియో సోషల్ మీడియా(social media)లోప్రస్తుతం చక్కర్లు కోడుతుంది. కొన్ని రోజుల్లోనే ఈ వీడియో మిలియన్ వ్యూస్ ను దాటేసింది. ఇది చూసిన నెటిజన్లు మేడమ్స్ ఎనర్జీ సూపర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొంత మంది ఎల్లో సారీలో ఉన్న ప్రొఫెసర్ బాగా డాన్స్ చేశారని కామెంట్లు చేశారు. ఈ క్రేజీ ఫ్లాష్ మాబ్ డాన్స్ పై మీరు కూడా ఓ లుక్కేయండి మరి.