మీరెప్పుడైనా ఐస్క్రీమ్ పానీపూరీ తయారు చేయడం చుశారా? లేదా అయితే ఈ వీడియోను చూసేయండి. సరికొత్తగా ట్రై చేసిన ఈ వంటకం వీడియో ప్రస్తుతం నెట్టింట్ వైరల్ అవుతోంది.
స్ట్రీట్ ఫుడ్(steet food) లలో ఎక్కువ మంది ఇష్టపడే వాటిలో పానీపూరీ(pani puri)కూడా ఒకటి. దీనిని నార్త్ ఇండియాలో గోల్ గప్పా అని, పశ్చిమ బెంగాల్లో పుచ్కాస్ అని పిలుస్తారు. ఇంకొన్ని ప్రాంతాల్లో గప్ చుప్ అనికూడా అంటారు. అయితే సాధారణంగా ఎక్కువ మంది తినే పానీపూరీలో వేడి వేడి చాట్ మసాలా, పుదీనా ఫ్లెవర్ గ్రీన్ వాటర్, ఉల్లిగడ్డ, కొంచెం పెరుగు సహా పలు పదర్థాలు కలిపి వీటిని సర్వ్ చేస్తుంటారు. ఈ రుచికరమైన చిరుతిండిని చిన్న పిల్లల నుంచి మొదలుకుని అమ్మాయిలు, అబ్బాయిలు సహా దాదాపు అందరూ ఎక్కువగా తినేందుకు ఇష్టపడతారు.
అయితే ఈ పానీపూరీని ఓ చోట సరికొత్తగా తయారు చేస్తున్నారు. పూరీలో నీటికి బదులు వెనీలా ఫ్లెవర్ ఐస్ క్రీం(ice cream), మరింత రుచి కోసం పలు రకాల ఫ్లేవర్లు, కొత్తిమీరతో కలిపి విభిన్నంగా రెడీ చేసి కస్టమర్లకు అందిస్తున్నాడు. అది స్వీకరించిన వినియోగదారులు టేస్ట్ సూపర్ అంటున్నారు. ఈ వంటకాన్ని స్పెషల్ గా తయారుచేస్తున్న విధానాన్ని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా..ఈ వీడియో(video) ప్రస్తుతం నెట్టింట వైరల్(viral)గా మారింది.
ఇది చూసిన పలువురు పానీపూరీ(pani puri)లో అనేక రకాల వైరటీలు ఉన్నాయని అంటున్నారు. దీంతోపాటు జున్ను, సబ్జీతో కూడా ఓసారి పానీపూరీ తయారు చేయాలని పలువురు సూచిస్తున్నారు. మరోవ్యక్తి అమూల్ వెన్న, జున్నుతో రెడీ చేయండని కోరుతున్నాడు. ఇలా ఈ వీడియో చూసిన నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
మరోవైపు దేశంలో చాలా చోట్ల పాపులర్ అయిన ఈ స్ట్రీట్ ఫుడ్ పానీపూరీ కేంద్రాల దగ్గర పరిశుభ్రత పాటించడం లేదని పలువురు అంటున్నారు. చేతులు సరిగా కడుక్కోకుండా మంచి నీటిని ఉపయోగించకుండా ఇష్టం వచ్చినట్లు చేస్తారని ఇంకొంత మంది చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గతంలో పానీపూరీ గురించి సోషల్ మీడియా(social media)లో కొన్ని వీడియోలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో ఇంట్లోనే పానీపూరీని తాయారు చేసుకోవాలని కోరుతున్నారు.