»Sonu Sood Explained About One Lady Suffering With Problem
Sonusood గొప్ప హృదయం.. 7.5 లక్షల మందికి సహాయం
తన తల్లి స్మృత్యార్థం ఫౌండేషన్ ఏర్పాటుచేసి సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేస్తున్నాడు. కరోనా సమయంలో దేవుడిలా సోనూ సూద్ ప్రజలకు సేవలు అందించాడు. ఆర్థిక, వైద్య, విద్య అన్ని రకాల సహాయ కార్యక్రమాలు సోనూ సూద్ చేశాడు.. చేస్తున్నాడు.. ఇంకా చేస్తాడు. అయితే సోనూసూద్ సేవా కార్యక్రమాలపై రాజకీయంగా వివాదం కొనసాగుతోంది.
సినీ పరిశ్రమలో నటుడిగా.. నిజ జీవితంలో ఓ హీరోలాగా సోనూసూద్ (Sonu Sood) మారాడు. తాను సంపాదించిన భాగంలో అధిక మొత్తంలో ప్రజల సేవ కోసం వినియోగిస్తున్న గొప్ప వ్యక్తి సోనూ సూద్. కరోనా సమయంలో మొదలైన సేవాభావం (Charity) నిరాటంకంగా సాగుతోంది. సేవా కార్యక్రమాలను ఉద్యమంలా కొనసాగిస్తున్నాడు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సోనూసూద్ సహాయం పొందని వారు లేరంటే అతిశయోక్తి కాదు. అలాంటి వ్యక్తి ఇప్పటివరకు తన సూద్ చారిటీ ఫౌండేషన్ (Sood Charity Foundation) ద్వారా ఎంత మందికి సహాయం చేశాడో తెలుసా? ఏకంగా 7.5 లక్షల మందికి సోనూసూద్ సహాయం అందించాడు. హైదరాబాద్ (Hyderabad)లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సోనూ సూద్ మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా పలువురు అడిగిన ప్రశ్నలకు కలియుగ కర్ణుడిగా పేరు పొందిన సోనూ సూద్ సమాధానమిచ్చాడు. అనంతరం సేవా కార్యక్రమాల సమయంలో తనకు గుర్తుండిపోయిన కొన్ని సంఘటనలను పంచుకున్నాడు. ఈ సందర్భంగా రాజకీయాలపై సోనూసూద్ మాట్లాడాడు. తనకు ఇప్పటివరకు రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన లేదని స్పష్టం చేశాడు. ప్రాణం ఉన్నంత వరకు ప్రజలకు సేవ చేస్తూనే ఉంటానని ప్రకటించాడు. ప్రతి రాష్ట్రంలో వృద్ధాశ్రమం (Oldage Home), ఉచిత పాఠశాలను ఏర్పాటు చేయాలనేది తన జీవిత లక్ష్యమని సోనూసూద్ వెల్లడించాడు. ఇప్పటివరకు 7.5 లక్షల మందికి పైగా సహాయం చేశానని తెలిపాడు. వాళ్లంతా తనకు ఎవరో తెలియదని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా కొన్ని మరచిపోలేని సంఘటనలు వివరించాడు.
‘ఓ రోజు షూటింగ్ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తుండగా అక్కడ పని చేసేవారు వారి సమస్యలను చెప్పారు. అవి వినేసరికి రాత్రి 9 గంటలు దాటింది. ఇంటికి వెళ్లాక అర్ధరాత్రి ఇంటి ముందు ఓ మహిళ కనిపించింది. అనారోగ్యంతో బాధపడుతున్నానని.. ఆదుకోవాలని కోరింది. ఆ సమయంలో ఓ డాక్టర్ కు రిపోర్టులు పంపి మెసేజ్ చేయగా తెల్లవారుజామున 2గంటలకు డాక్టర్ స్పందించాడు. ఆయన తర్వాత 5 నెలల పాటు వైద్యం అందించడంతో ఆమె కోలుకుంది’ అని సోనూసూద్ తెలిపాడు.
భారతీయ సినిమాకు సోనూసూద్ విశేష సేవలు అందిస్తున్నాడు. అన్ని ప్రధాన భాషల్లో సోనూ నటించాడు. 20 ఏళ్ల తన నటనా ప్రస్థానంలో దాదాపు 100కు పైగా సినిమాలు చేశాడు. సంపాదించిన దానిలో కొంత ప్రజలకు సేవ చేయాలని భావించాడు. తన తల్లి స్మృత్యార్థం ఫౌండేషన్ ఏర్పాటుచేసి సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేస్తున్నాడు. కరోనా సమయంలో దేవుడిలా సోనూ సూద్ ప్రజలకు సేవలు అందించాడు. ఆర్థిక, వైద్య, విద్య అన్ని రకాల సహాయ కార్యక్రమాలు సోనూ సూద్ చేశాడు.. చేస్తున్నాడు.. ఇంకా చేస్తాడు. అయితే సోనూసూద్ సేవా కార్యక్రమాలపై రాజకీయంగా వివాదం కొనసాగుతోంది. ఆయన రాజకీయాల్లోకి వచ్చేందుకు సేవా కార్యక్రమాలు అందిస్తున్నాడని విమర్శలు వచ్చాయి. అయితే వాటిని పట్టించుకోలేదు. ఇప్పట్లో అయితే రాజకీయాల్లోకి రానని ప్రకటించాడు. తుది శ్వాస వరకు సేవా కార్యక్రమాలు కొనసాగిస్తానని తాజాగా సోనూ సూద్ స్పష్టం చేశాడు.