VZM: చీపురుపల్లిలో వేంచేసియున్న శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో 5వ శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి వివిధ రకాల పండ్లతో అలంకరణ చేశారు. ముందుగా అర్చకులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో అమ్మవారికి వేకువజాము నుంచి పంచామృతాభిషేకాలు నిర్వహించి, సామూహిక కుంకుమ పూజలు చేశారు. పండ్లు అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు.