ASR: జీ.మాడుగుల మండలంలోని బోయితెలి గ్రామం సమీపంలో గురువారం అర్థరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులపై ఆకస్మికంగా కరెంట్ తీగలు పడటంతో, విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందారు. మరణించిన వారు నర్సీపట్నం ప్రాంతానికి చెందినవారని స్థానికులు తెలిపారు. ఘటనపై పోలీసులు, విద్యుత్ శాఖ అధికారులు విచారణ జరుపుతున్నారు.