SKLM: రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలు ప్రజలకు చేరవేయడంలో నిర్లక్ష్యం తగదని, ప్రతి ఒక్క ఉద్యోగి బాధ్యతాయుతంగా పనిచేయాలని శ్రీకాకుళం ఎమ్మార్వో ఎం.గణపతిరావు సూచించారు. గురువారం తహశీల్దార్ కార్యాలయంలో పరిపాలన విధానంపై కార్యాలయ సిబ్బందితో పాటు, వీఆర్వోలు, సర్వేయర్లుతో ఆయన సమావేశం నిర్వహించారు. ప్రజలకు సకాలంలో వాటి పరిష్కారానికి చొరవ చూపాలన్నారు.