MBNR: వికారాబాద్ జిల్లా పరిగి శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లా మహమ్మదాబాద్, గండీడ్ మండలాలలో పర్యటించనున్నారు. మహమ్మదాబాద్ మండలంలోని ముకర్లాబాద్,షేక్ పల్లి ముందలి తాండాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్నారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో మహిళా సంఘాల సభ్యులకు కోటి రూపాయల చెక్కును అందించనున్నారు.