KMR: మాచారెడ్డి మండలంలోని పలు గ్రామాల్లో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ నేడు పర్యటించనున్నారు. ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ బ్రహ్మానందరెడ్డి చెప్పారు. మండలంలోని సర్దపూర్ తండాలో గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి, నెమలి గుట్ట తండాలో అంగన్వాడీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారన్నారు.