‘పునాది రాళ్ళు’ చిత్రంతో సినీ ప్రస్థానం మొదలుపెట్టిన చిరంజీవి.. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక మెగాస్టార్‌గా ఎదిగారు. ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి.. తన డ్యాన్స్, యాక్షన్, సామాజిక స్పృహతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆయన ఇప్పటివరకు 10 ఫిల్మ్‌ఫేర్, 3 నంది అవార్డులు సాధించారు. 2006లో పద్మభూషణ్, 2024లో పద్మ విభూషణ్ అందుకున్నారు.