ATP: గుత్తి మండలం గొల్లలదొడ్డి (సేవాఘడ్) గిరిజన గురుకుల పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి 5,6,7,8 తరగతులతో పాటు ఇంటర్లో ఖాళీగా ఉన్న సీట్లకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆ పాఠశాల ప్రిన్సిపాల్ విజయ్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్టీ విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు.