KMM: యూరియా కొరత ఎదురు కాకుండా సరిపడా సరఫరా చేసి రైతుల ఇక్కట్లను తీర్చాలని ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో రాని కొరత ఇప్పుడు రావడం గర్హనీయమన్నారు. సీఎంగా కేసీఆర్ ఉన్నప్పుడు ప్రణాళికాయుతంగా వ్యవహరించడంతో ఇబ్బందులు రాలేదని, ఇప్పుడు ప్రభుత్వ తీరుతో ప్రతీ గ్రామంలో ఎరువుల కోసం రైతులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.