NLR: తనకు బెయిల్ సందర్భంగా విధించిన షరతును సవరించాలని కోరుతూ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాకాణిని ప్రతి ఆదివారం దర్యాప్తు అధికారి ముందు హాజరవ్వాలని, పోలీసులు చార్జిషీట్ దాఖలు చేసే వరకు నెల్లూరు రావడానికి వీల్లేదని హైకోర్టు షరతు విధించింది. ఈ షరతును సవరించాలని కోరగా తదుపరి విచారణను హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది.