VZM: జిల్లాలోని సాఫ్ట్బాల్ జిల్లా బాలికల జట్టు ఎంపిక పోటీలు ఈనెల 23వ తేదీన భోగాపురం మండలంలోని తూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరగనుంది. ఈ మేరకు సంఘ ఆర్గనైజింగ్ కార్యదర్శి సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ పాఠశాలల నుంచి ఆసక్తి ఉన్న విద్యార్థినిలు పాల్గొనాలని తెలిపారు. ఈనెల 30, 31వ తేదీల్లో రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.