VSP: మురళీనగర్ వాకర్స్ పార్క్ వద్ద ఆదివారం ఉచిత వైద్య శిబిరం జరిగింది. AINU హాస్పిటల్, వాసన్ ఐ కేర్ సహకారంతో 247మంది (జనరల్ 154, కంటి93) పరీక్షలు చేయించుకున్నారు. నీరు అధికంగా తాగాలని, ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించాలంటూ డా.రవీంద్ర వర్మ సూచించారు. బీపీ, షుగర్, కంటి, ఆర్థోపెడిక్ తదితర పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమం విజయవంతమై ప్రజల విశేష స్పందన లభించింది.