ప్రకాశం: కనిగిరి మున్సిపల్ పరిధిలోని శంఖవరంలో గురువారం రాత్రి డి.ఎస్.పి సాయి యశ్వంత్ ఈశ్వర్ పల్లెనిద్ర కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామస్తులతో సమావేశమైన డీఎస్పీ సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించారు. అదేవిధంగా గ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కొత్త వ్యక్తులు గ్రామంలో సంచరిస్తున్నట్లు అనుమానం ఉంటే వెంటనే ఆ సమాచారాన్ని పోలీసులకు తెలపాలన్నారు