MNCL: జన్నారంలో ఎస్ఎఫ్ఐ జీపు జాత జరగనున్నదని సీపీఎం జన్నారం మండల కార్యదర్శి కనికారపు అశోక్ తెలిపారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ మంచిర్యాల విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన జీపుజాత శుక్రవారం జన్నారం మండల కేంద్రంలో జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విధానాలను ప్రజలకు తెలుపుతారన్నారు.